News September 10, 2025
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి, ఏలూరు, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వానలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
Similar News
News September 10, 2025
మరోసారి భారత్, చైనాలపై ట్రంప్ అక్కసు

భారత్‌తో మళ్లీ <<17663735>>స్నేహం<<>> కోరుకుంటూనే ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతున్నారు. భారత్, చైనాలపై 100% టారిఫ్స్ విధించాలని యూరోపియన్ యూనియన్‌ను కోరినట్లు సమాచారం. US, EU అధికారుల సమావేశంలో రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై చర్చ జరిగింది. ఈ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ INDపై 50%, చైనాపై 30% టారిఫ్స్ విధించారు.
News September 10, 2025
ట్రంప్‌తో మాట్లాడేందుకు నేనూ ఎదురుచూస్తున్నా: PM మోదీ

తనతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానన్న <<17663735>>ట్రంప్<<>> వ్యాఖ్యలకు PM మోదీ బదులిచ్చారు. తానూ ట్రంప్‌తో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. క్లోజ్ ఫ్రెండ్స్ అయిన IND, US మధ్య వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోయి, సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు ఇరుదేశాలూ కృషి చేస్తున్నాయని, IND-US భవిష్యత్తు కోసం ఇద్దరం కలిసి పనిచేస్తామన్నారు.
News September 10, 2025
గేట్‌కు దరఖాస్తు చేశారా?

<