News September 25, 2024

ఈ జిల్లాల్లో 2 రోజులు భారీ వర్షాలు

image

TG: పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం ADB, ASF, MNCL, NML, NZB, JGL, SRCL, BHPL, KMM, KTDM, MHBD, SDPT, KMR, JN జిల్లాల్లో, గురువారం ADB, ASF, MNCL, NML, NZB, JGL, SRCL, BHPL, KNR, MLG, PDPL, KMR జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. HYD సహా మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Similar News

News December 1, 2025

CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

image

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్‌నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

News December 1, 2025

₹50వేల కోట్ల దావా.. AERA పక్షాన కేంద్రం!

image

ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల ప్రైవేట్ ఆపరేటర్లు, ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (AERA) ఆఫ్ ఇండియా మధ్య ₹50వేల కోట్ల దావా SCకు చేరింది. ఇందులో కేంద్రం AERA పక్షాన నిలిచింది. రెగ్యులేటెడ్ సర్వీసెస్ కోసం కాలిక్యులేట్ చేసే అసెట్స్ క్యాపిటల్ వ్యాల్యూపై విభేదాలున్నాయి. ఆపరేటర్లు గెలిస్తే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో యూజర్ డెవలప్మెంట్ ఫీజు ₹129 నుంచి ₹1261కి, ముంబైలో ₹175 నుంచి ₹3,856కు పెరుగుతుంది.

News December 1, 2025

భార్య పదవిని భర్త అనుభవిస్తే వేటు తప్పదు!

image

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. మహిళా రిజర్వేషన్ ఉన్నచోట్ల భర్తలు తమ భార్యలతో నామినేషన్ వేయించారు. కొన్నిచోట్ల భార్యలను ఇంటికి పరిమితం చేసి వారి పదవిని భర్తలు అనుభవిస్తుంటారు. ఇలా చేయడం రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశమైన మహిళా సాధికారతకు ఆటంకం కలిగించడమే. ఎన్నికైన మహిళా సర్పంచ్ అధికారాలను ఆమె భర్త అనుభవిస్తే అది అధికారాల దుర్వినియోగంగా గుర్తించి పదవిలో నుంచి తొలగించే అవకాశం ఉంది. SHARE IT