News August 7, 2025

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నల్గొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో(30-40km/h) కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

Similar News

News August 9, 2025

2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు: APSDMA

image

AP: దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) పేర్కొంది. దీని ప్రభావంతో 2రోజుల పాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.

News August 9, 2025

భారత్‌పై ట్రంప్ విధించిన 50% టారిఫ్స్‌ వల్ల ఏం జరుగుతుంది?

image

ఈ టారిఫ్స్‌ను భారత్ భరించదు. మన దేశ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే USలోని వ్యాపారులు అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఆ భారాన్ని పూడ్చుకోడానికి వస్తువుల ధరలు పెంచుతారు. ఫలితంగా వాటిని కొనే అమెరికా కస్టమర్లే ఆ భారం భరించాల్సి ఉంటుంది. అయితే మన కంపెనీల ఎగుమతులపై ప్రభావం పడకుండా ప్రభుత్వం ఇతర మార్కెట్లను అన్వేషిస్తోంది. నష్టాన్ని సబ్సిడైజ్ చేసే అవకాశం లేకపోలేదు.

News August 9, 2025

అది తప్పుడు ప్రచారం: చిరంజీవి

image

సినీ కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై తాను హామీ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. ‘కార్మికులకు 30% వేతనం పెంపు తదితర డిమాండ్లు అమలయ్యేలా చూస్తానని, షూటింగ్ ప్రారంభిస్తానని నేను హామీ ఇచ్చినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరినీ కలవలేదు. ఇది ఇండస్ట్రీ సమస్య. వ్యక్తిగతంగా ఎలాంటి హామీ ఇవ్వలేను. ఫిల్మ్ ఛాంబర్‌దే తుది నిర్ణయం’ అని పేర్కొన్నారు.