News August 9, 2025

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

TGలోని NLG, సూర్యాపేట, MHBD, WGL, HNK, HYD, జనగాం, యాదాద్రి, రంగారెడ్డి, MBNR, NGKL, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. అటు APలోని ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది.

Similar News

News August 9, 2025

మతం దాచి పెళ్లి చేసుకుంటే జైలుకే.. హరియాణా చట్టం

image

మతాన్ని దాచి పెళ్లి చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరియాణా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మతమార్పిడికి పాల్పడినా, పెళ్లి కోసం మతం మార్చుకోవాలని అడిగినా ₹4లక్షల జరిమానా, పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. మతస్వేచ్ఛను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని, ఆ పేరుతో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. చట్టబద్ధంగా అనుమతి పొందాకే మత మార్పిడి చేసుకోవాలంది.

News August 9, 2025

ఆ వెబ్ సిరీస్ చూసి బాలుడి సూసైడ్

image

బెంగళూరులో ఓ బాలుడు (14) వెబ్ సిరీస్ చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నమ్మకెరే అచ్చకట్టు పీఎస్ పరిధిలో నివసించే గాంధార్ ఇటీవల జపనీస్ వెబ్ సిరీస్ ‘డెత్ నోట్’ చూస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో గదిలోకి వెళ్లి ఓ లేఖ రాసి ఉరేసుకుని చనిపోయాడు. ‘నేను వెళ్లే సమయం ఆసన్నమైంది. మీరు ఈ లేఖ చదివే సమయానికి స్వర్గంలో ఉంటా’ అని రాశాడు. సిరీస్‌లోని ఓ క్యారెక్టర్ బొమ్మను కూడా తన గదిలో గీశాడు.

News August 9, 2025

త్వరలో చేతక్, చీతా చాపర్లకు రీప్లేస్‌మెంట్!

image

పాతబడిన చేతక్, చీతా చాపర్లను మోడర్న్ లైట్ హెలికాప్టర్లతో భర్తీ చేయాలని భారత రక్షణ శాఖ భావిస్తోంది. ఇందుకు సంబంధించి విక్రేతలు, సరఫరాదారుల నుంచి సమాచారం కోసం రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్(RFI)ను జారీ చేసింది. ఇవి సెర్చ్&రెస్క్యూలో పగలు, రాత్రి వేళల్లో పనిచేస్తూ సైనిక దళాలను, స్పెషల్ మిషన్ లోడ్స్‌ను తరలించేలా ఉండాలని పేర్కొంది. మొత్తం 200 హెలికాప్టర్లలో ఆర్మీకి 120, ఎయిర్‌ఫోర్స్‌కి 80 కేటాయించనుంది.