News June 18, 2024

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో ఈ నెల 23 వరకు వర్షాలు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు 30-40Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

Similar News

News September 15, 2025

ఆక్వా రంగాన్ని ఆదుకోవాలి: CM చంద్రబాబు

image

AP: నష్టాల్లో కూరుకుపోయిన ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక, వాణిజ్య, మత్స్యశాఖల మంత్రులకు CM చంద్రబాబు లేఖలు రాశారు. ‘US టారిఫ్స్‌తో ఆక్వా రంగానికి రూ.25 వేల కోట్ల నష్టం జరిగింది. 50 శాతం ఆర్డర్లు రద్దయ్యాయి. ఆక్వా రైతులు నష్టపోకుండా కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆక్వా ఉత్పత్తుల రవాణాకు డెడికేటెడ్ రైళ్లు నడపాలి. ఆక్వా రుణాల వడ్డీలపై మారటోరియం విధించాలి’ అంటూ సీఎం విజ్ఞప్తి చేశారు.

News September 15, 2025

నేడు స్థానిక ఎన్నికలపై సీఎం సమావేశం

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై ఇవాళ సీఎం రేవంత్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, పొంగులేటి, పొన్నం, ఉత్తమ్ పాల్గొననున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అటు హైకోర్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నందున ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

News September 15, 2025

పవర్‌గ్రిడ్‌లో 866 అప్రంటిస్‌లు.. AP, TGలో ఎన్నంటే?

image

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 866 అప్రంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్, సివిల్, రాజ్‌భాష, ఎగ్జిక్యూటివ్ లా విభాగాల్లో APలో 34, TGలో 37 ఖాళీలు ఉన్నాయి. పోస్టులను బట్టి ITI, డిప్లొమా, డిగ్రీ, PG చేసి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. పోస్టును అనుసరించి స్టైపెండ్ రూ.13,000 నుంచి రూ.17,500 వరకు ఉంటుంది. అక్టోబర్ 6లోగా powergrid.in సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.