News July 18, 2024
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: అల్పపీడనం ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నంద్యాల, SKLM, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. VZM, అనకాపల్లి, కర్నూలు, ATP, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయంది.
Similar News
News November 9, 2025
బస్సు ప్రమాదం.. వెలుగులోకి కీలక విషయాలు

TG: రాష్ట్రంలో పలు కుటుంబాల్లో విషాదం నింపిన మీర్జాగూడ <<18199288>>బస్సు<<>> ప్రమాదంలో ఫోరెన్సిక్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. ప్రమాదంలో మరణించిన టిప్పర్, బస్సు డ్రైవర్లు మద్యం తీసుకోలేదని తేలింది. మృతదేహాలలో ఆల్కహాల్ ఆనవాళ్లు లేవని చేవెళ్ల ఏసీపీ కిషన్ గౌడ్ స్పష్టం చేశారు. అయితే వెహికల్స్ కండిషన్స్కు సంబంధించిన రిపోర్టు రావాల్సి ఉందని తెలిపారు. ఈ ప్రమాదంలో 19మంది మరణించిన సంగతి తెలిసిందే.
News November 9, 2025
పెరుగుతున్న చలి.. వచ్చేవారం మరో అల్పపీడనం

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఏపీలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో నిన్న 14.5 డిగ్రీలు, చాలా జిల్లాల్లో 20-25 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తెలంగాణలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. మరోవైపు వచ్చేవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయన్నారు.
News November 9, 2025
ఆముదపు విత్తులు ముత్యాలవుతాయా?

ఒక వస్తువు లేదా వ్యక్తి సహజ స్వభావం ఎప్పటికీ మారదు. ఆముదపు విత్తనాలు ఎప్పటికీ ఆముదపు విత్తనాలుగానే ఉంటాయి, అవి విలువైన ముత్యాలుగా మారవు. అలాగే దుర్మార్గులైన లేదా చెడ్డ స్వభావం కలిగిన వ్యక్తులు వారి ప్రవర్తనను మార్చుకోరని చెప్పడానికి.. సహజంగా జరగని లేదా అసాధ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.


