News August 22, 2024
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Similar News
News January 21, 2026
‘మూసీ పునరుజ్జీవనం’లో ‘టాటా’ భాగస్వామ్యం

TG: దావోస్లో టాటా ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో CM రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. విజన్–2047 లక్ష్యాలు, రాష్ట్రంలోని పెట్టుబడుల అనుకూల విధానాలను వివరించారు. HYDలోని స్టేడియాల అభివృద్ధికి సహకరించాలని కోరగా టాటా ఛైర్మన్ సంసిద్దత తెలిపారు. మూసీ నది పునరుజ్జీవనంలో భాగస్వామ్యమయ్యేందుకు ఆసక్తి వ్యక్తపరిచారు. హోటళ్లు, రిసార్ట్స్, మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు చేసేందుకు CM చంద్రశేఖరన్ చర్చించారు.
News January 21, 2026
గుండెపోటుతో నటుడు మృతి

మలయాళ నటి ఊర్వశి సోదరుడు, నటుడు కమల్ రాయ్(54) కన్నుమూశారు. చెన్నైలో ఆయన గుండెపోటుతో మరణించారు. తమిళ్ సినిమా ‘పుతుస పడికిరెన్ పాటు’ సినిమాతో హీరోగా పరిచయమైన కమల్ 30 చిత్రాల్లో నటించారు. ఇందులో సాయుజ్యం, మంజు, కింగిని, వచలమ్, శోభనం, ది కింగ్ మేకర్, లీడర్ తదితర సినిమాలున్నాయి. ఆయన సోదరి ఊర్వశి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో మొత్తం 350 చిత్రాల్లో నటించారు.
News January 21, 2026
ఆరావళి అక్రమ మైనింగ్.. కోలుకోలేని నష్టమన్న SC

ఆరావళి పర్వతాల్లో అక్రమ మైనింగ్పై రివ్యూ చేసేందుకు ఎక్స్పర్ట్ కమిటీని నియమిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అక్రమ మైనింగ్ కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. కమిటీ కోసం పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తల పేర్లను 4 వారాల్లోగా ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. నిపుణుల కమిటీ తమ పర్యవేక్షణలో పనిచేస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్తగా మైనింగ్ లీజులను మంజూరు చేయడాన్ని నిషేధించింది.


