News September 22, 2024

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయంది. శ్రీకాకుళం, తూ.గో, YSR, అన్నమయ్య, చిత్తూరులో మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Similar News

News November 23, 2025

భూమిలో కర్బన నిల్వల స్థాయి టెస్టింగ్ ఇలా..

image

ఒక చెంచాతో 1 గ్రాము మట్టిని, 2ml పొటాషియం డైక్రోమేట్‌తో పాటు 2ml సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఒక సీసాలో పోసి బాగా కలపాలి. 20 నిమిషాల తర్వాత ఆ సీసాలో నీటిని పోయాలి. ఆ ద్రావణం మారిన రంగును బట్టి భూమిలో కర్బన శాతం తెలుసుకోవచ్చు. ☛ నారింజ/పసుపు రంగు – కర్బన స్థాయి తక్కువ ☛ ముదురు గోధుమ/ నలుపు రంగు – కర్బన స్థాయి మధ్యస్థం ☛ ఆకు పచ్చ/ నీలి రంగు – కర్బన స్థాయి ఎక్కువ.

News November 23, 2025

2 రోజుల్లోనే ముగిసిన టెస్టు.. రూ.17.35 కోట్ల నష్టం!

image

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు కేవలం 2 రోజుల్లో ముగియడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియాకు భారీ నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. మూడు, నాలుగో రోజులకు అమ్మకానికి ఉంచిన టికెట్‌ ఆదాయం కోల్పోవడంతో దాదాపు రూ.17.35 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. మూడో రోజు టికెట్లు దాదాపు అమ్ముడుపోయినట్లు సమాచారం. మొదటి రెండు రోజుల్లోనే లక్షకుపైగా అభిమానులు హాజరైనా, తర్వాతి రోజుల ఆదాయం కోల్పోవడం గట్టిదెబ్బే.

News November 23, 2025

ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారు కానీ ఆధారాలు లేవు: ప్రశాంత్ కిషోర్

image

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంపై జన్‌ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే అనుమానం ఉందని, కానీ దానికి ఆధారాలు లేవని తెలిపారు. గ్రౌండ్‌ ఫీడ్‌బ్యాక్‌కు భిన్నంగా ఫలితాలు ఉన్నాయని, ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోందని అన్నారు. కాగా 243 స్థానాలున్న బిహార్‌లో 238 చోట్ల పోటీ చేసినా JSP ఒక్క సీటు కూడా గెలవలేదు. ఓటు శాతం 2-3%కే పరిమితమైంది.