News September 11, 2025

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

image

AP: రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు ఉమ్మడి ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.

Similar News

News April 9, 2026

రేషన్ కార్డుల రీవెరిఫికేషన్.. అనర్హుల తొలగింపు!

image

TG: అనర్హులకు రేషన్ కార్డులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం విజిలెన్స్ విభాగం PAN, GST నంబర్లను రేషన్ కార్డు డేటాతో లింక్ చేసి టెస్టు చేసినట్లు సమాచారం. దీంతో HYDలోనే 2L మంది ట్యాక్స్‌పేయర్స్‌, ప్రభుత్వ ఉద్యోగులకు బియ్యం కార్డులున్నట్లు తేలిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 80% వెరిఫికేషన్ పూర్తయినట్లు పేర్కొంటున్నాయి. పూర్తి డేటా రాగానే కార్డులను రద్దు చేస్తామంటున్నాయి.

News April 9, 2026

EMIలు కట్టే వారికి గుడ్‌న్యూస్

image

రెపో రేటులో RBI ఎలాంటి మార్పులు <<19596095>>చేయనప్పటికీ<<>> లోన్ EMIలు తగ్గనున్నాయి. 2025లో RBI రెపో రేటులో 1.25%(125 బేసిస్ పాయింట్లు) కోత పెట్టినా బ్యాంకులు మాత్రం కొత్త లోన్లపై 89 BPs, యాక్టివ్ లోన్లపై 87BPs తగ్గించాయి. అంటే మరో 36 BPsను తగ్గించేందుకు అవకాశం ఉంది. వచ్చే 3 నెలల్లో రెపో రేటు కోత ప్రయోజనాలను బ్యాంకులు వినియోగదారులకు అందించనున్నాయి. దీంతో ఇంటి, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్ ఉంది.

News April 9, 2026

వదినపై రూ.2 కోట్లకు దావా వేసిన హన్సిక

image

ఇటీవలే భర్త సోహైల్ నుంచి <<19356860>>విడాకులు<<>> తీసుకున్న నటి హన్సిక ఇంటిపోరుతో సతమతమవుతున్నారు. తనతోపాటు కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారంటూ వదిన (అన్న భార్య) ముస్కాన్‌పై రూ.2Cr పరువు నష్టం దావా వేశారు. తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో హన్సికకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు <<17679047>>చేయొద్దని<<>> ముంబై సెషన్స్ కోర్టు ముస్కాన్‌ను ఆదేశించింది.