News September 8, 2024
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ

AP: వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా వానలు కొనసాగుతాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, ఉ.గో. జిల్లాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని హెచ్చరించింది. దీంతో GVMC అప్రమత్తమైంది. 184 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని, సాయం కోసం 180042500009 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించింది.
Similar News
News January 19, 2026
వరిలో జింకు లోపాన్ని ఎలా నివారించాలి?

వరి తర్వాత తిరిగి వరినే పండించే నేలలో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను ప్రతి రబీ పంటకు ముందు దమ్ములో వేసి పైరులో జింకు లోపం ఏర్పడకుండా నివారించవచ్చు. భాస్వరం ఎరువులు వేయడానికి 2 రోజుల ముందు జింకు సల్ఫేట్ వేయాలి. పైరుపై జింకు లోపం కనిపిస్తే ఒక ఎకరానికి 400 గ్రాముల జింకు సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి వరి ఆకులు మొత్తం తడిచేలా.. నిపుణుల సూచనలతో వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.
News January 19, 2026
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ చేయనున్న TTD

AP: ఏప్రిల్ కోటా తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన)ను 10AMకు TTD విడుదల చేయనుంది. 21వ తేదీ ఉ.10గం.ల వరకు ఆన్‌లైన్‌లో ఈ-డిప్‌కు నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు 23న మ.12 గంటల్లోపు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. 22న ఆర్జిత సేవ టికెట్లు(కళ్యాణోత్సవం), 23న అంగ ప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, 24న అకామిడేషన్(రూమ్స్), రూ.300 దర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు.
News January 19, 2026
అదును తప్పిన పైరు.. ముదిమిలో బిడ్డలు ఒక్కటే

ఏ పంటకైనా అదును(అనుకూల సమయం) ముఖ్యం. సరైన సమయానికి విత్తనం వేయకపోతే పంట సరిగా రాదు, దాని వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ముసలి వయసులో పిల్లలు పుడితే, వారు తల్లిదండ్రులకు అండగా నిలబడలేరు లేదా వారికి సేవ చేయలేరు. ఈ రెండూ సమయానికి చేయని పనులు లేదా నిష్ప్రయోజనమైన పరిస్థితులను తెలియజేస్తాయి.


