News September 2, 2024
భారీ వర్షాలు.. ప్రభుత్వ సాయం పెంపు

TG: భారీ వర్షాలు, వరదలకు పశువులు మరణిస్తే ఇచ్చే పరిహారం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాడి గేదెలు చనిపోతే ఒక్కో దానికి రూ.50వేలు, గొర్రెలు, మేకలకు రూ.5వేల చొప్పున ఇవ్వాలన్నారు. అలాగే పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి రూ.10వేల చొప్పున నష్ట పరిహారం ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వెంటనే బాధిత కుటుంబాలకు సాయం అందించాలన్నారు.
Similar News
News October 17, 2025
16 నెలల్లో ₹లక్ష కోట్లకు పైగా సంక్షేమం, అభివృద్ధి: చంద్రబాబు

AP: గత 16 నెలల్లో ₹లక్ష కోట్లకు పైగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని CM CBN తెలిపారు. 2047కి పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అందులో భాగమే ‘P4 జీరో పావర్టీ’ అని వివరించారు. NTR భరోసా, అన్న క్యాంటీన్లు, దీపం-2, తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని చెప్పారు. పేదరిక నిర్మూలన దినం సందర్భంగా అందరూ పీ4లో భాగస్వాములు కావాలని కోరారు.
News October 17, 2025
మునగ సాగుకు ప్రభుత్వ సబ్సిడీలు ఇలా..

AP: మునగ సాగును ఉపాధి హామీ పథకానికి ప్రభుత్వం అనుసంధానించింది. గుంతలు తీయడం, మొక్కలు నాటడం, నీరు పెట్టడానికి డబ్బు చెల్లిస్తుంది. 25సెంట్లలో నాటితే రెండేళ్లలో ₹38,125, 50 సెంట్లకు ₹75,148, 75 సెంట్లకు ₹1.25L, ఎకరాకు ₹1.49L ఆర్థిక భరోసా ఉంటుంది. ఈ ఏడాది 12 జిల్లాల్లో(అన్నమయ్య, అనంతపురం, అనకాపల్లి, బాపట్ల, చిత్తూరు, నంద్యాల, గుంటూరు, ప్రకాశం, సత్యసాయి, శ్రీకాకుళం, పల్నాడు, తిరుపతి) అమలు చేస్తోంది.
News October 17, 2025
మునగ.. ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు సాయం

AP: మునగ సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చేయూతనందిస్తోంది. డ్వాక్రా మహిళ కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని, ప్లాంట్ వ్యయాన్ని బట్టి ₹10L, ఆపైన కూడా సెర్ప్ ద్వారా రుణం మంజూరు చేయిస్తుంది. మునగ ప్రొడక్ట్‌లను కొనుగోలు చేసేలా ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుంది. దీనిద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా లాభపడనున్నాయి. పూర్తి వివరాలకు వ్యవసాయ అధికారులను సంప్రదించండి.