News October 9, 2025

భారీ వర్షాలు.. చెరకులో నీరు నిలిచి ఉందా?

image

ఇటీవల వర్షాలకు చాలా చోట్ల చెరకు పంట ముంపునకు గురైంది. అయితే చెరకులో నీరు నిల్వ ఉండకుండా, వెంటనే బయటకు పంపాలి. వర్షాలు తగ్గిన వెంటనే ఎకరానికి 50 కిలోల యూరియా, 40 కిలోల పొటాష్ చెరకు మొక్కల మొదళ్ల దగ్గర గుంటలు చేసి వేసి కప్పాలి. ఒకవేళ పొలం నుంచి మురుగు నీటిని తీయని పరిస్థితుల్లో పైపాటుగా లీటర్ నీటికి 2.5గ్రా. యూరియా, 2.5గ్రా. పొటాష్ ఎరువులు కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

Similar News

News October 9, 2025

మంచి భార్య రావాలనే వ్రతాలు ఉండవా?

image

మంచి భర్తను పొందడానికి అమ్మాయిలు అనేక వ్రతాలు ఆచరిస్తారు. కానీ సుగుణ సతీమణిని పొందడానికి అబ్బాయిలకు ఏ దివ్యమార్గం లేదా అనే సందేహం చాలామందిలో కలుగుతుంది. అయితే దీనికి పరిష్కారం ఉందని పండితులు చెబుతున్నారు. మంచి భార్య లభించాలని కోరుకునే పురుషులు దుర్గా దేవిని ప్రార్థించాలని సూచిస్తున్నారు. నిత్యం ‘పత్నీం మనోరమాం దేహి’ అనే మంత్రాన్ని పఠిస్తే.. సద్గుణాలు గల అమ్మాయి ధర్మపత్నిగా వస్తుందని అంటున్నారు.

News October 9, 2025

గూగుల్ సబ్సిడరీ కంపెనీ రూ.87 వేల కోట్ల పెట్టుబడులు

image

AP: ఆసియాలోనే అతి పెద్ద డేటా క్లస్టర్‌ను గూగుల్ సబ్సిడరీ కంపెనీ రైడెన్ ఇన్ఫోటెక్ విశాఖలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం ఏకంగా రూ.87,520 కోట్లు ఖర్చు చేయనుంది. దీనికి 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం కూడా లభించింది. దేశంలో ఇదే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కావడం విశేషం. విశాఖకు రానున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు అనుసంధానంగా ఈ సంస్థ 3 క్యాంపస్లు ఏర్పాటు చేయనుంది.

News October 9, 2025

బీసీ రిజర్వేషన్లు.. నేడు 2.15PMకు విచారణ

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవోపై నేడూ హైకోర్టులో విచారణ జరగనుంది. 2.15PM నుంచి వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. నిన్న 4.30 గంటల పాటు కోర్టు.. ప్రభుత్వ, పిటిషనర్ల వాదనలు విని కొన్ని ప్రశ్నలు వేసింది. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో నేటి నుంచి MPTC, ZPTCల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.