News December 12, 2024

భారీ వర్షాలు.. కీలక ఆదేశాలు

image

APలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులను హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. ‘వర్ష ప్రభావ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. వర్షాలతో ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులకు ఫోన్ కాల్స్, SMSలతో ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపాలి’ అని ఆమె ఆదేశించారు.

Similar News

News December 12, 2024

క్యాబినెట్ నిర్ణయంపై విపక్ష సీఎంల ఫైర్

image

జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. క్యాబినెట్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ ఎన్నికల నిర్వహణ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రయత్నమని దుయ్యబట్టారు. మరోవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రతిపక్షాల గొంతు నొక్కేలా ఉందని, దీనిని వ్యతిరేకించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు.

News December 12, 2024

సంక్రాంతిలోగా వీఆర్వో వ్యవస్థ తీసుకొస్తాం: మంత్రి

image

TG: సంక్రాంతిలోగా వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈనెల 31లోగా హాస్టళ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ తల్లి విగ్రహంపై సమాధానం లేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా టీషర్టుల డ్రామా ఆడి పారిపోయారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

News December 12, 2024

ALERT.. ఈ జిల్లాల్లో చలిగాలులు

image

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.