News June 3, 2024
కేరళను వణికిస్తున్న భారీ వర్షాలు

రుతుపవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం జిల్లాలో
582 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. కంజిరపల్లి, వైకోమ్, చంగనస్సెరీ డివిజన్లలో 33 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. కొట్టాయం(D)లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. పథనంతిట్ట, అలప్పుళ, ఇడుక్కి, వయనాడ్ జిల్లాల్లో ఈదురుగాలులతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.
Similar News
News January 9, 2026
ట్రంప్ దెబ్బకు మార్కెట్ బేజారు.. భారీ నష్టాలు

భారత్‌పై 500% సుంకాలు విధించే ప్రపోజల్ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తెలపడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 193 పాయింట్లు పడిపోయి 25,683 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 604 పాయింట్లు పతనమై 83,576 వద్ద ముగిసింది. దీంతో వరుసగా నాలుగోరోజు కూడా మార్కెట్ నష్టాలతో ముగిసింది. 2025 సెప్టెంబర్ తర్వాత ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి.
News January 9, 2026
వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

ఉదయ్‌పూర్(RJ)లోని లీలా ప్యాలెస్ హోటల్‌కు కన్జూమర్ కోర్టు ₹10 లక్షల జరిమానా విధించింది. చెన్నైకి చెందిన దంపతులు వాష్‌రూమ్‌లో ఉన్న సమయంలో హోటల్ సిబ్బంది ‘మాస్టర్ కీ’తో గదిలోకి ప్రవేశించడమే దీనికి కారణం. వద్దని అరిచినా వినకుండా లోపలికి తొంగిచూసి ప్రైవసీకి భంగం కలిగించారని బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే ‘Do Not Disturb’ బోర్డు లేనందునే లోపలికి వెళ్లామని యాజమాన్యం వాదించినా కోర్టు ఏకీభవించలేదు.
News January 9, 2026
భూరికార్డులను ఎవరూ మార్చలేరు: చంద్రబాబు

AP: పాస్‌బుక్స్ పంపిణీ పవిత్రమైన కార్యక్రమమని CM చంద్రబాబు తెలిపారు. తూ.గో.జిల్లా రాయవరంలో ఆయన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ప్రాణం పోయినా రైతు భూమి కోల్పోయేందుకు అంగీకరించడు. సున్నితమైన అంశంతో పెట్టుకోవద్దని మాజీ CMకు చెప్పినా వినలేదు. కూటమి రాకపోయుంటే రైతుల భూములు గోవిందా గోవిందా. రాజముద్ర వేసి మళ్లీ పాస్‌బుక్స్ ఇస్తున్నాం. మీ భూరికార్డులను ఎవరూ మార్చలేరు. మోసం చేయలేరు’ అని స్పష్టం చేశారు.


