News August 28, 2025
భారీ వర్షాలు.. లేహ్‌లో చిక్కుకున్న మాధవన్

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా నటుడు మాధవన్ మరోసారి లేహ్‌లో చిక్కుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 17 ఏళ్లనాటి ఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘మేము షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాం. గత 4రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. విమానాశ్రయాలు కూడా మూతపడ్డాయి. 2008లో త్రీ ఇడియట్స్ షూట్ కోసం వచ్చినప్పుడు కూడా ఇలాగే చిక్కుకున్నాం. అప్పుడు మంచు విపరీతంగా కురిసింది’ అని ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు.
Similar News
News August 28, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
News August 28, 2025
రేపు హాల్‌టికెట్లు విడుదల

APలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల హాల్‌టికెట్లు రేపు విడుదల కానున్నాయి. సెప్టెంబర్ 7న ఈ పరీక్షలను ఆఫ్‌లైన్ మోడ్‌లో 13 ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి నిర్దేశిత సమయం కంటే ముందే చేరుకోవాలని, హాల్‌టికెట్లను APPSC <
News August 28, 2025
కామారెడ్డికి వెళ్లలేకపోయిన సీఎం రేవంత్

TG: హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం రేవంత్ కామారెడ్డికి వెళ్లలేకపోయారు. దీంతో మెదక్ చేరుకుని అక్కడి ఎస్పీ ఆఫీస్‌లో వరదల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేశ్, ఎంపీ రఘునందన్ ఉన్నారు. అంతకుముందు సీఎం ఎల్లంపల్లి, పోచారం ప్రాజెక్టులను పరిశీలించారు.