News August 10, 2025

భారీ వర్షాలు.. ప్రజలు సహకరించాలన్న మంత్రి పొన్నం

image

TG: వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాసులు ప్రజారవాణాను ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వర్షాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక భారీ వర్షాలు కురుస్తున్నాయని, వర్షం తగ్గగానే అందరూ ఒకేసారి రోడ్ల మీదకు రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని చెప్పారు. కాస్త సమయం తీసుకొని రోడ్లపైకి వచ్చి ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

Similar News

News August 10, 2025

రాబర్ట్ వాద్రా రూ.58 కోట్లు తీసుకున్నారు: ED

image

ఆర్థిక నేరం కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త <<16104501>>రాబర్ట్<<>> వాద్రాకు ఉచ్చు బిగుస్తోంది. అక్రమ ల్యాండ్ డీల్ వ్యవహారంలో ఆయనకు రూ.58 కోట్ల ముడుపులు అందినట్లు ఛార్జ్‌షీట్‌లో ED పేర్కొంది. స్కై లైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రూ.53 కోట్లు, బ్లూ బ్రీజ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రూ.5 కోట్లు పొందారంది. ఈ డబ్బుతో ఆయన స్థిరాస్తుల కొనుగోళ్లతో పాటు పెట్టుబడులు పెట్టారని తెలిపింది.

News August 10, 2025

తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతాం: ఉత్తమ్

image

TG: తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును కట్టి తీరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. దేవాదుల పంపుహౌస్ పరిశీలించిన ఆయన అక్కడి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైందని తెలిపారు. భూసేకరణ కోసం రూ.67 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. పెండింగ్ బిల్లులనూ త్వరలో మంజూరు చేస్తామన్నారు.

News August 10, 2025

రేపు పీఎం ఫసల్ బీమా యోజన నిధులు విడుదల

image

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద 30లక్షల మంది రైతులకు రేపు పంట బీమా నిధులు రిలీజ్ చేయనున్నారు. రాజస్థాన్‌లో జుంజునులో జరిగే కార్యక్రమంలో రూ.3,200 కోట్ల నగదును కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అత్యధికంగా మధ్య‌ప్రదేశ్ రైతులకు రూ.1,156కోట్లు, రాజస్థాన్‌కు రూ.1,121కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు రూ.150కోట్లు, ఇతర రాష్ట్రాల రైతులకు రూ.773కోట్లు ట్రాన్స్‌ఫర్ చేయనున్నారు.