News October 6, 2025

అధిక వర్షాలు.. కూరగాయ పంటల్లో జాగ్రత్తలు

image

భారీ వర్షాల సమయంలో పొలంలో నిలిచిన నీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు పంపేలా చూసుకోవాలి. లేకుంటే పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది. వర్షాలు ఆగిన వెంటనే 19:19:19 లేదా 13:0:45 లేదా యూరియా వంటి పోషకాలను వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటపై పిచికారీ చేయాలి. అధిక వర్షాలతో విత్తనం మొలకెత్తనప్పుడు లేదా లేత మొక్కలు దెబ్బతిన్నప్పుడు నర్సరీలోనే నారు పెంచుకోవాలి. అంతర సేద్యం చేసి కలుపును తొలగించాలి.

Similar News

News October 6, 2025

13,217 బ్యాంక్ ఉద్యోగాలు.. BIG ALERT

image

IBPS ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ల పోస్టులకు అప్లై చేసుకున్నవారికి అలర్ట్. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకోవడానికి ఇవాళ, రేపు మాత్రమే అవకాశం ఉంది. https://www.ibps.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎడిట్ చేసుకోవచ్చు. నవంబర్, డిసెంబర్‌లో ప్రిలిమ్స్, ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలుంటాయి.
* మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>‘జాబ్స్’<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 6, 2025

రిజర్వేషన్లపై హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు

image

TG: ప్రభుత్వం ప్రతిపాదించిన BC రిజర్వేషన్లకు మద్దతుగా హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నేత VH, బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య, మాజీ IAS చిరంజీవులు వీటిని ఫైల్ చేశారు. బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్‌ దాఖలైంది. ఈక్రమంలోనే ఈ కేసులో తమ వాదనలూ వినాలని కోరుతూ ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. వీటన్నింటినీ న్యాయస్థానం ఎల్లుండి విచారించనుంది.

News October 6, 2025

తురకపాలెంలో మళ్లీ మృత్యు కలకలం!

image

AP: గుంటూరు రూరల్(M) తురకపాలెంలో కృష్ణవేణి అనే మహిళ హైఫీవర్‌తో గుంటూరు ఆసుపత్రిలో మరణించింది. గతంలో 30 వరుస మరణాలతో గ్రామం వార్తల్లోకి ఎక్కింది. పారిశుద్ధ్యం లేకపోవడం, నీటిలో యురేనియం అవశేషాల వల్లే ఇలా అవుతోందని తేలింది. ప్రభుత్వం వైద్య బృందాలను పంపి నివారణ చర్యలు చేపట్టింది. నెలరోజుల పాటు ఇవి ఆగడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా గతంలోలాగే మహిళ మరణించడంతో జనం కలవరపడుతున్నారు.