News October 27, 2025

అధిక వర్షాలు.. పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు (1/2)

image

AP: భారీ వర్షాలకు పత్తి చేను ముంపునకు గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర వ్యవసాయశాఖ కొన్ని సూచనలు చేసింది. ముందుగా పత్తిచేలో వర్షపు నీటిని తొలగించాలి. చాలా చోట్ల పత్తి పూత, కాయ దశలో ఉంది. పైపాటుగా యూరియా ఎకరానికి 30kgలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 15kgలు భూమిలో వేయాలి. 2% యూరియా లేదా 2% పొటాషియం నైట్రేట్‌ను 1శాతం మెగ్నీషియం సల్ఫేట్‌తో కలిపి 5 నుంచి 7 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి.

Similar News

News October 27, 2025

ఆలస్యంగా ప్రెగ్నెంట్ అయితే..

image

మహిళల్లో గర్భధారణ ఆలస్యమైతే పిల్లల్లో ‘డౌన్స్ సిండ్రోమ్ రిస్క్’ పెరుగుతుంది. 25ఏళ్ల వయసులో ప్రెగ్నెంటయితే 1250 మందిలో ఒకరికి, 30ఏళ్లలో 1000 మందిలో ఒకరికి, 35ఏళ్లలో 400 మందిలో ఒకరికి, 40ఏళ్లలో 100 మందిలో ఒకరికి, 45ఏళ్లలో 30 మందిలో ఒకరికి రిస్క్ ఉంటుంది. పిల్లల్లో శారీరక, మానసిక లోపాలుంటాయి. దీన్ని గుర్తించడానికి ట్రిపుల్ స్క్రీన్ పరీక్ష చేయించాలి. #ShareIt
* ఉమెన్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.

News October 27, 2025

శ్రేయస్‌కు సీరియస్.. అసలు ఏమైందంటే?

image

శ్రేయస్ అయ్యర్ గాయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అతడికి ఇంటర్నల్ ఇంజ్యూరీ అయింది. ఎడమవైపు పక్కటెముకల వద్ద ఉండే Spleen(ప్లీహమ్) అవయవానికి తీవ్ర గాయమైంది. ఇది ఇంటర్నల్ బ్లీడింగ్(spleen rupture)కు దారితీసింది. దీంతో సాధారణంగా ప్లీహమ్ చేసే రక్తకణాల శుద్ధి, బ్లడ్ సెల్స్‌ స్టోరేజీ, పాత రక్తకణాల తొలగింపు ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఈ గాయాన్ని హీల్ చేసేందుకే శ్రేయస్‌ను ICUలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

News October 27, 2025

అసలైన భక్తులకు ప్రతిదీ దైవమే!

image

సమస్త జీవుల్లో దేవుణ్ని చూస్తూ, వాటిని సంతోషపెట్టడమే నిజమైన ఈశ్వర పూజ. మనసులో భగవంతుణ్ని స్థాపించుకున్న భక్తులు ఉన్నత స్థితికి చేరుకుంటారు. స్థిరమైన, అవిచ్ఛిన్నమైన భక్తిని కలిగి ఉంటారు. అలాంటి భక్తులు తమ పనులన్నింటినీ భగవత్ సేవగానే భావించి, అంకితభావంతో చేస్తాడు. అందువల్ల వారికి వేరే ధ్యానం, ఆరాధన కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉండదు. అతని ప్రతి కర్మ నిరంతర పూజగా మారుతుంది.<<-se>>#Daivam<<>>