News October 24, 2024

భారీగా వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: సీఎం

image

AP: భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన ఇవాళ ఉదయం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని అధికారులు సీఎంకు వివరించారు. నేడూ భారీ వర్షాలున్న నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.

Similar News

News October 24, 2024

APPLY: NICలో 500 అసిస్టెంట్ ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 500 పోస్టులు ఖాళీలున్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 21 నుంచి 30 ఏళ్ల లోపు వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. అభ్యర్థులు నవంబర్ 11లోపు ఆన్‌లైన్లో అప్లై చేసుకోవాలి. నవంబర్ 30న ఫేజ్-1, డిసెంబర్ 28న ఫేజ్-2 రాత పరీక్షలు నిర్వహిస్తారు. వెబ్‌సైట్: nationalinsurance.nic.co.in/recruitment

News October 24, 2024

‘టార్జాన్’ నటుడు కన్నుమూత

image

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. హాలీవుడ్ నటుడు రాన్ ఎలీ(86) కన్నుమూశారు. 1960లో కండలు తిరిగిన ‘టార్జాన్’గా ఆయన నటించారు. ఈ సినిమాతో ఎంతో గుర్తింపు పొందారు. ఆయన మరణ వార్తను కుమార్తె కిర్‌స్టెన్ సోషల్ మీడియా ద్వారా తాజాగా ధ్రువీకరించారు. ఈ ప్రపంచం ఓ గొప్ప వ్యక్తిని, తాను తండ్రిని కోల్పోయినట్లు ట్వీట్‌లో ఆమె పేర్కొన్నారు. 100కు పైగా సినిమాల్లో నటించిన ఆయన 2001లో నటనకు స్వస్తిపలికి రచయితగా మారారు.

News October 24, 2024

నమ్ముకున్న పార్టీయే నన్ను అవమానిస్తోంది: జీవన్‌రెడ్డి

image

TG: నమ్ముకున్న పార్టీయే తనను అవమానిస్తోందంటూ AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ MLC జీవన్‌రెడ్డి లేఖ రాశారు. తన భవిష్యత్తు కార్యాచరణపై పార్టీనే మార్గదర్శకం చేయాలన్నారు. కాంగ్రెస్ కూడా కేసీఆర్‌లా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. పార్టీలో ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.