News March 20, 2024
నేడు భారీ వర్షాలు

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Similar News
News April 22, 2025
నటన నా రక్తంలోనే ఉంది.. త్వరలోనే రీఎంట్రీ: రంభ

తన పిల్లల కోసమే సినిమాలకు దూరమయ్యానని అలనాటి హీరోయిన్ రంభ వెల్లడించారు. ఇప్పుడు కుమార్తెలకు 14, 10 ఏళ్లు, కుమారుడికి 6 ఏళ్లు వచ్చాయన్నారు. ప్రస్తుతం భర్త ప్రోత్సాహంతో ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీకి 15 ఏళ్లు దూరమైనా నటన తన రక్తంలోనే ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. త్వరలోనే వెండితెరపై కనిపించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
News April 22, 2025
మతిమరుపు ఎక్కువవుతోందా.. కారణం అదే కావొచ్చు!

శరీరానికి సరిపడా మోతాదులో విటమిన్-కె అందనివారిలో మతిమరుపు సమస్యలు ఎక్కువవుతాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘దెబ్బ తగిలిన చోట రక్తాన్ని గడ్డ కట్టించడం నుంచి ఎముకలు, మెదడు ఆరోగ్యం వరకు విటమిన్-కె చాలా కీలకం. ఆకుకూరల్లో ఇది పుష్కలంగా లభిస్తుంది. చురుకుగా ఆలోచించడానికి, మెరుగైన జ్ఞాపకశక్తికి పాలకూర, బ్రకోలీ, క్యాబేజీ, పాలు, గుడ్లు, పళ్లు వంటివి పుష్కలంగా తీసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
News April 22, 2025
మామిడి కృత్రిమ పక్వానికి ఇది వాడండి

మామిడి కృత్రిమ పక్వానికి నిషేధిత పదార్థాలు కాకుండా ఎథెఫోన్ను ఉపయోగించాలని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు. 10కేజీల మామిడికి 500mg ఎథెఫోన్ వాడాలని చెబుతున్నారు. ముందుగా ఎథెఫోన్ సాచెట్ను నీటిలో నానబెట్టి, చిన్న ప్లాస్టిక్ పెట్టెలో ఉంచాలి. ఆ తర్వాత పండ్ల పెట్టెను గాలి చొరబడకుండా ఉంచి ఎథెఫోన్ సాచెట్ ఉన్న బాక్స్ను 24 గంటల పాటు ఉంచాలని చెబుతున్నారు.