News December 13, 2024

నేడు భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ తమిళనాడు వద్ద గురువారం అర్ధరాత్రి తీరం దాటింది. కాగా, ఇవాళ ఉదయం బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశమున్నట్లు పేర్కొంది. అటు, అల్పపీడనం తీరం దాటిన సందర్భంగా TNలో భారీ వర్షాలు పడుతున్నాయి.

Similar News

News January 8, 2026

కోహ్లీ పేరు ఎత్తకుంటే వారికి ఇల్లు గడవదు: వికాస్ కోహ్లీ

image

కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌పై విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ ఫైరయ్యారు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి <<18780306>>ఈజీ ఫార్మాట్‌<<>>లో కోహ్లీ కొనసాగుతున్నారని చేసిన విమర్శలకు పరోక్షంగా కౌంటరిచ్చారు. ‘విరాట్ పేరు ఎత్తకుంటే కొందరికి ఇల్లు గడవదు’ అనే అర్థం వచ్చేలా SMలో రాసుకొచ్చారు. గతంలో విరాట్ స్ట్రైక్ రేట్‌ను మంజ్రేకర్ విమర్శించగా, ‘మంజ్రేకర్ కెరియర్‌లో ODI స్ట్రైక్ రేట్ 64.30’ అని వికాస్ సెటైర్ వేశారు.

News January 8, 2026

ప్రీమియర్స్ కోసం వెయిటింగ్ ‘రాజాసాబ్’!

image

TG: ‘రాజాసాబ్’ ప్రీమియర్స్ విషయంలో సస్పెన్స్ వీడటం లేదు. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో ఫ్యాన్స్‌కు ఎదురుచూపులు తప్పడం లేదు. దీంతో బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి? ప్రీమియర్స్ ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. అప్డేట్ ఇవ్వాలంటూ మేకర్స్‌ను అడుగుతున్నారు. కాగా మరికాసేపట్లో రాజాసాబ్ ప్రీమియర్లపై జీవో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

News January 8, 2026

ఈడీ రెయిడ్స్.. ఇంతకీ ప్రతీక్ జైన్ ఎవరు?

image

ఐప్యాక్ ఆఫీసు, ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంటిపై <<18796717>>ED దాడులు<<>> చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతీక్ జైన్ ఎవరనే చర్చ జరుగుతోంది. IIT బాంబే పూర్వ విద్యార్థి అయిన ప్రతీక్ ఎన్నికల వ్యూహం, డేటా విశ్లేషణలో ఎక్స్‌పర్ట్. I-PAC కోఫౌండర్. 2019 నుంచి TMCతో కలిసి పని చేస్తున్నారు. ఆ పార్టీ IT సెల్ హెడ్‌గానూ ప్రతీక్ కొనసాగుతున్నారు. TMCతోపాటు పలు పార్టీలు, ప్రభుత్వాలకు సలహాదారుగా I-PAC వ్యవహరిస్తోంది.