News June 27, 2024
నేడు, రేపు భారీ వర్షాలు

AP: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Similar News
News November 4, 2025
BCలకు వెన్నుదన్నుగా ఆదరణ 3.0: సవిత

AP: BCల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదరణ 3.0 పథకం అమలుపై వర్క్ షాప్ను ప్రారంభించారు. ‘BCలు సమిష్టిగా కూటమిని గెలిపించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వారెంతో నష్టపోయారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే BCలకు బడ్జెట్లో అత్యధికంగా నిధులు కేటాయించాం. వారి కాళ్లపై వారు నిలబడాలని ఆదరణ 3.0 పథకం అమలు చేస్తున్నాం. దానికి బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించాం’ అని తెలిపారు.
News November 4, 2025
షెఫాలీ బౌలింగ్ మాకు బిగ్ సర్ప్రైజ్: లారా

తాము వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడానికి షెఫాలీ వర్మ బౌలింగ్ కూడా కారణమని SA కెప్టెన్ లారా ఒప్పుకున్నారు. ‘షెఫాలీ బౌలింగ్ మాకు బిగ్ సర్ప్రైజ్. WC పైనల్లాంటి మ్యాచుల్లో పార్ట్టైమ్ బౌలర్లకు వికెట్లు కోల్పోవడం కరెక్ట్ కాదు. ఆమె బంతిని నెమ్మదిగా సంధిస్తూనే రెండు వికెట్లు తీసుకుంది. ఇంక ఆమెకు వికెట్స్ ఇవ్వకూడదు అనుకుంటూ మిస్టేక్స్ చేశాం. భారత్ నిర్ణయం మమ్మల్ని ఆశ్చర్య పరిచింది’ అని లారా తెలిపారు.
News November 4, 2025
నవంబర్ 4: చరిత్రలో ఈరోజు

✦ 1889: పారిశ్రామికవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్ జననం (ఫొటోలో)
✦ 1929: గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలా దేవి జననం (ఫొటోలో)
✦ 1932: సినీ దర్శకుడు, నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ జననం
✦ 1944: ఇండియన్ ఎయిర్ఫోర్స్లో తొలి మహిళా ఎయిర్ మార్షల్ పద్మావతి బందోపాధ్యాయ జననం
✦ 1964: దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు జననం
✦ 1971: నటి టబు జననం


