News August 5, 2025

నేడు భారీ వర్షాలు: IMD

image

TG: ఇవాళ మేడ్చల్, HYD, సంగారెడ్డి, RR, నాగర్ కర్నూల్, MBNR, వనపర్తి, నారాయణ్‌పేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. BHPL, ములుగు, కొత్తగూడెం, KMM, నల్గొండ, సూర్యాపేట, MHBD, వరంగల్, HNK, జనగాం, SDPT, భువనగిరి, వికారాబాద్, MDK, కామారెడ్డిలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇతర చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది.

Similar News

News August 5, 2025

ఉదయం పెళ్లి.. రాత్రి నవ వధువు ఆత్మహత్య

image

AP: సత్యసాయి జిల్లాలో ఓ నవ వధువు శోభనం గదిలోనే ఆత్మహత్యకు పాల్పడింది. సోమందేపల్లికి చెందిన హర్షిత (22)కు కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన నాగేంద్రతో నిన్న ఉదయం వివాహం జరిగింది. యువతి ఇంట్లో కుటుంబసభ్యులు శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి ఆమె ఉరేసుకుంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

News August 5, 2025

ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీ అడ్మిషన్స్.. ఆ రూల్ ఛేంజ్!

image

AP: ప్రైవేటు స్కూళ్లలో 25% సీట్లను ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు విద్యార్థుల ఇళ్లకు 3kmsలోపు ఉన్న స్కూళ్లలో అడ్మిషన్లు ఇచ్చారు. ఇకపై 3-5kms దూరంలో ఉన్న స్కూళ్లలోనూ కేటాయించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. విద్యార్థుల తల్లులకు ఇప్పటికే ‘తల్లికి వందనం’ వచ్చి ఉంటే ఫీజులు వారే చెల్లించాలని తెలిపింది.

News August 5, 2025

కరుణ్ కెరీర్ ముగిసినట్లేనా?

image

దేశీయ టోర్నీల్లో సూపర్ ఫామ్‌తో భారత జట్టులో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అంచనాలను అందుకోలేకపోయారు. ట్రిపుల్ సెంచరీ చేసిన తొమ్మిదేళ్లకు జాతీయ జట్టులోకి వచ్చిన ఆయన ఈ సిరీస్‌లో 25.63 సగటుతో 205 పరుగులే చేశారు. చివరి టెస్టులో అర్ధ సెంచరీ మినహా ఆయన పేలవ ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో వచ్చే సిరీస్‌లో ఆయన స్థానంలో వేరే ప్లేయర్‌కు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.