News July 11, 2024
రేపు భారీ వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40కి.మీ వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
Similar News
News March 28, 2026
పడిపోయిన రూపాయి మారకం విలువ.. మోదీపై కాంగ్రెస్ సెటైర్

అమెరికన్ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95కి చేరిందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ప్రధాని మోదీకి ఇది గొప్ప విజయం అని సెటైర్ వేసింది. ‘మోదీ ఎక్కడ దాక్కున్నావ్’ అంటూ మరో పోస్ట్ పెట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరతో పాటు డాలర్‌కు డిమాండ్ పెరగడమే రూపాయి విలువ పడిపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
News March 28, 2026
IPL: మౌనం పాటించిన RCB, SRH ప్లేయర్లు

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట మృతులకు RCB, SRH ప్లేయర్లు నివాళులు అర్పించారు. <<19501634>>మ్యాచ్<<>> ఆరంభ సమయంలో మైదానంలోకి వెళ్లే ముందే బౌండరీ లైన్ వద్ద 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ టైమ్‌లో స్టేడియంలోని ప్రేక్షకులంతా లేచి నిలబడి మృతులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. మృతులకు జ్ఞాపకార్థంగా స్టేడియంలో 11 సీట్లను ఖాళీగా వదిలేసిన విషయం తెలిసిందే.
News March 28, 2026
హైడ్రేటెడ్‌గా ఉండాలంటే వాటర్ తాగితే చాలా?

హైడ్రేటెడ్‌గా ఉండాలంటే కేవలం నీళ్లు తాగితే సరిపోదని వైద్యులు చెబుతున్నారు. సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లూ అవసరమని, ఇందుకోసం పొటాషియం, మెగ్నీషియం, సహజ లవణాలు ఉండే ఆహారాలు (అరటి, నారింజ, పాలకూర etc) తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకేసారి ఎక్కువ నీరు తాగితే ఉపయోగం ఉండదని చెబుతున్నారు. శరీరం డీహైడ్రేట్ అయిందనడానికి దాహం చివరి సంకేతమని, అందుకే దప్పిక లేకపోయినా నీళ్లు తాగాలంటున్నారు.


