News October 2, 2024
రేపు భారీ వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నంద్యాల, కర్నూల్, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడొచ్చని పేర్కొంది. అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Similar News
News January 26, 2026
వాహనాలపై అలాంటి స్టిక్కర్లు వేస్తే..

TG: వాహనాలపై పోలీస్, ప్రెస్, అడ్వకేట్ వంటి వివిధ హోదాల స్టిక్కర్ల వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. అనధికారికంగా ప్రభుత్వ చిహ్నాలు, జెండాలు, వృత్తి పేర్లు వాడితే చర్యలు తప్పవని I&PR స్పెషల్ కమిషనర్ ప్రియాంక ఆదేశాలు జారీ చేశారు. నంబర్ ప్లేట్లపై ఎలాంటి రాతలు ఉండకూడదని హెచ్చరించారు. అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ‘PRESS’ అనే పదాన్ని ఉపయోగించాలన్నారు.
News January 26, 2026
ఇతరుల అగ్గిపెట్టెతో దీపం వెలిగిస్తున్నారా..?

దీపారాధన చేసేటప్పుడు ఇతరుల అగ్గిపెట్టెను వాడకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇది శుభప్రదం కాదంటున్నారు. ఇలా చేస్తే పుణ్యఫలం మీకు దక్కకుండా ఇతరులకు చేరుతుందని అంటున్నారు. ‘వెలుగుతున్న ఇతర దీపాలతోనూ దీపారాధన చేయకూడదు. సొంతంగా కొన్న అగ్గిపెట్టెనే వాడాలి. అలాగే స్నేహితులు, చుట్టాలతో గుడికి వెళ్లినప్పుడు పూజా సామగ్రి కూడా సొంత డబ్బుతోనే కొనుగోలు చేయాలి. అప్పుడే ఆ పుణ్యం మీకొస్తుంది’ అని చెబుతున్నారు.
News January 26, 2026
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

AP: వరుస సెలవుల ప్రభావంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఎస్ఎస్డీ టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 84,014 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 35,131 మంది తలనీలాలు సమర్పించారు. ఆలయ హుండీ ఆదాయం రూ.3.69 కోట్లుగా నమోదైంది. భక్తులు దర్శనానికి ముందుగా సరైన ప్రణాళికతో రావాలని, భద్రతా సూచనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.


