News August 19, 2025

రేపు అతిభారీ వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. TGలోని ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో రేపు కూడా అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కామారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వానలు పడతాయంది. అటు APలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.

Similar News

News March 6, 2026

ముందు ఇరాన్.. తర్వాత క్యూబా: ట్రంప్

image

ఇరాన్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్ తన నెక్స్ట్ టార్గెట్ వెల్లడించారు. ఇరాన్‌పై పోరుపై దృష్టిపెట్టానని.. అది అయిపోయాక త్వరలోనే క్యూబా సంగతి చూస్తానని వైట్ హౌస్‌లోని ఓ ఈవెంట్‌లో తెలిపారు. అమెరికాతో డీల్ చేసుకునేందుకు క్యూబా ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే అమెరికా క్యూబాపై ఆంక్షలు విధించింది. కాగా ఇటీవల <<19260435>>క్యూబాను<<>> అమెరికా స్నేహపూర్వకంగా దక్కించుకునే అవకాశం ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు.

News March 6, 2026

ఇరాన్‌పై US దాడులు.. ఏఐతో సెకన్లలో ప్లానింగ్!

image

US మిలిటరీకి AI కొత్త అస్త్రంగా మారింది. ఇరాన్‌పై దాడులు స్టార్ట్ చేసినప్పుడు 12 గంటల్లో 900కుపైగా లక్ష్యాలపై అటాక్ ఏఐతోనే సాధ్యమైంది. మేవెన్ స్మార్ట్ సిస్టమ్ 150కిపైగా సోర్సుల నుంచి రహస్య డేటా సేకరించి సెకన్లలో టార్గెట్స్ సెట్ చేసింది. సాధారణంగా ఈ ప్రక్రియకు కొన్నిరోజులు పడుతుంది. అయితే పాత డేటాతో తప్పుడు లక్ష్యాలపై దాడి జరిగే ప్రమాదం ఉంది. స్కూల్‌పై <<19288920>>దాడి<<>> అలాగే అయి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి.

News March 6, 2026

తెలంగాణకు కొత్త గవర్నర్

image

కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది. తెలంగాణకు శివ ప్రతాప్ శుక్లాను అపాయింట్ చేసింది. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు. ఇక TG గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. నాగాలాండ్ గవర్నర్‌గా నంద్ కిశోర్ యాదవ్, బిహార్ గవర్నర్‌గా సయ్యద్ హస్నేన్, బెంగాల్ గవర్నర్‌గా R.N. రవిని నియమించింది.