News December 16, 2024
రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ఎల్లుండి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వివరించింది.
Similar News
News November 18, 2025
ఎన్కౌంటర్స్ మొత్తం ఫేక్: కూనంనేని

మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లు మొత్తం ఫేక్ అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మావోయిస్టులను చంపుకుంటూ పోవడం మానవ హననమేనని, ఇది జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ పోలీసులు ఇందులో పావులుగా మారారని ఆరోపించారు. మాడేరుమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్తో సహా అన్ని ఎన్కౌంటర్లు కట్టుకథలని ఆయన స్పష్టం చేశారు.

ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.