News September 8, 2025

రేపు భారీ వర్షాలు: APSDMA

image

AP: దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు పార్వతీపురం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండవద్దని హెచ్చరించింది.

Similar News

News September 8, 2025

ఇకపై ప్రతి రోజూ తిరుపతి-షిర్డీ రైలు

image

AP: సీఎం చంద్రబాబు ప్రతిపాదన మేరకు ఇకపై ప్రతి రోజూ తిరుపతి-షిర్డీ మధ్య రైలు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 07637/07638 నంబర్ రైలు రేణిగుంట, కడప, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ మీదుగా ప్రయాణిస్తుంది. బ్రహ్మోత్సవాలు, పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ రైలును రెగ్యులర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ రైలు టెంపరరీ సర్వీస్‌గా కొనసాగింది.

News September 8, 2025

ఢిల్లీలో రేవంత్

image

TG: ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. రేపు ఉ.10 గం. నుంచి సా.5 గం. వరకు ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత అధికారులు ఫలితాలు వెల్లడించనున్నారు. అటు రేవంత్ రేపు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, పెండింగ్ నిధులపై వినతిపత్రాలు ఇస్తారని తెలుస్తోంది. యూరియా కొరత, ఇటీవల భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని వారికి వివరించనున్నారు.

News September 8, 2025

వెరైటీ ఆఫర్.. బరువు తగ్గితే డబ్బులు

image

ఉద్యోగులు ఫిట్‌గా ఉండేందుకు చైనాలోని Arashi Vision అనే కంపెనీ వెరైటీ విధానానికి శ్రీకారం చుట్టింది. బరువు తగ్గితే మొత్తం 1 మిలియన్ యువాన్లు (రూ.1.23 కోట్లు) రివార్డుల రూపంలో ఇస్తామని ప్రకటించింది. 500 గ్రాములు తగ్గితే రూ.6,181 ఇస్తామని తెలిపింది. ఓ ఉద్యోగి 3 నెలల్లో 20 కేజీలు తగ్గి రూ.2.46 లక్షలు గెలుచుకున్నాడు. ఈ పోటీలో పాల్గొన్న ఉద్యోగులు తిరిగి బరువు పెరిగితే 500 గ్రా.కు రూ.9,867 చెల్లించాలి.