News September 21, 2025

రేపు భారీ వర్షాలు: APSDMA

image

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. దీని ప్రభావంతో.. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇవాళ రాత్రి 7గంటల వరకు ప్రకాశం(D) సింగరాయకొండలో 69.5MM, చిత్తూరు(D) యడమర్రిలో 61MM వర్షపాతం నమోదైందని తెలిపింది.

Similar News

News September 22, 2025

‘ఇది నా మరణ వాంగ్మూలం’.. మాజీ డీఎస్పీ పోస్ట్

image

TG: మాజీ డీఎస్పీ నళిని తన ‘మరణ వాంగ్మూలం’ అంటూ FBలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. తన ఆరోగ్య పరిస్థితి కొంత కాలంగా ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ‘నా జీవితం ముగియబోతోంది. సాయం చేయాలని CMకు ఇచ్చిన అర్జీ బుట్టదాఖలైంది. కేంద్రం సాయం చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాను. నేను స్థాపించిన వేదామృతం ట్రస్టుకు నా మరణానంతరం మోదీ సాయం చేయాలి. నా మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు’ అని పేర్కొన్నారు.

News September 22, 2025

నటి రాధిక ఇంట్లో తీవ్ర విషాదం

image

సీనియర్ నటి రాధిక ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి గీతా రాధ(86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచినట్లు రాధిక తెలిపారు. చివరి చూపుల కోసం ఆమె భౌతికకాయాన్ని పోయెస్ గార్డెన్‌లో ఉంచారు. రేపు (సెప్టెంబర్ 22) చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశానవాటికలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

News September 22, 2025

రేపు ‘దసరా బోనస్’ ప్రకటించనున్న సీఎం!

image

TG: సింగరేణి ఉద్యోగులకు CM రేవంత్ రేపు ‘దసరా బోనస్’ ప్రకటించనున్నట్లు సమాచారం. శాశ్వత ఉద్యోగులకు రూ. 1.90 లక్షలు, తాత్కాలిక ఉద్యోగులకు రూ. 5వేల వరకు బోనస్ లభించే అవకాశం ఉంది. అలాగే సింగరేణి ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏటా బొగ్గు అమ్మకాలు, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా వచ్చే లాభాల నుంచి ఉద్యోగులకు బోనస్ ఇస్తోంది.