News October 8, 2025

రేపు భారీ వర్షాలు: APSDMA

image

AP: ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 2 రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. రేపు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇవాళ NTR, GNT, బాపట్ల, అనంత, సత్యసాయి తదితర జిల్లాల్లో వర్షం పడింది.

Similar News

News April 6, 2026

‘కుంభకర్ణుడి నిద్ర’కు కారణమేంటి?

image

ఎప్పుడూ నిద్రపోతూ, ఎంత పిలిచినా లేవని వాళ్లను కుంభకర్ణుడిలా నిద్రపోతున్నావని అంటాం. బలవంతుడైన కుంభకర్ణుడు ఇంద్రాసనం పొందడానికి బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తారు. ఇది ప్రమాదమని గ్రహించిన సరస్వతి అతని నాలుకపై చేరి నిద్రాసనం కోరుకొనేలా చేస్తారు. తర్వాత కుంభకర్ణుడి వినతి మేరకు 6 నెలలు నిద్ర, ఓరోజు మెలకువగా వరాన్ని బ్రహ్మ సవరిస్తారు.
* మీకు తెలిసి కుంభకర్ణుడిలా నిద్రపోయేవారెవరైనా ఉన్నారా?
<<-se>>#EPICSAYINGS<<>>

News April 6, 2026

ధోనీకి 2 రోజుల్లో ఫిట్‌నెస్ టెస్ట్?

image

CSK మాజీ కెప్టెన్ ధోనీ IPLలో త్వరలోనే ఆడే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2 రోజుల్లో ఆయనకు ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తారని CSK క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అందులో పాస్ అయితే ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీతో జరిగే మ్యాచులో ఆయన బరిలోకి దిగుతారంటున్నాయి. ఫిట్‌నెస్ లేక IPLకు రెండు వారాల పాటు ధోనీ దూరమవుతారని జట్టు యాజమాన్యం చెప్పిన విషయం తెలిసిందే. కాగా CSK ఈ సీజన్‌లో ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓడిపోయింది.

News April 6, 2026

FLASH: పెరిగిన బంగారం, వెండి ధరలు

image

ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) దిశగా సంకేతాలు రావడంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇవాళ <<19578430>>ఉదయంతో<<>> పోలిస్తే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,530 పెరిగి రూ.1,50,660కి చేరింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,400 వృద్ధితో రూ.1,38,100 వద్ద కొనసాగుతోంది. వెండి కూడా కేజీకి రూ.5,000 ఎగబాకి రూ.2,60,000 పలుకుతోంది.