News August 31, 2024

భారీ వర్షాలు.. రెండు విషాద ఘటనలు

image

TG: భారీ వర్షాలు పలుచోట్ల విషాదం నింపాయి. కామారెడ్డి(D) నస్రుళ్లబాద్(మ) నాచుపల్లిలో కరెంట్ షాక్‌తో డిగ్రీ విద్యార్థిని స్వాతి(18) మృతి చెందారు. ఇంటి వెనుక చెట్టుపై పిడుగుపడటంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అవి నేరుగా రేకుల ఇంటిని తాకటంతో విద్యుత్ సరఫరా అయ్యింది. ఇంటి తలుపులు ముట్టుకున్న స్వాతి అక్కడికక్కడే చనిపోయింది. అటు ములుగు(D) తాడ్వాయి నార్లాపూర్‌లో పిడుగుపాటుకు యువకుడు మహేశ్ మృతి చెందాడు.

Similar News

News December 1, 2025

ఏపీలో 10 చోట్ల వాటర్ ఏరో డ్రోమ్స్

image

APలోని 10 ప్రాంతాల్లో వాటర్ ఏరో డ్రోమ్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. సీ ప్లేన్స్ ఆపరేషన్లకు వీలుగా వీటిని ఏర్పాటు చేయనుందని చెప్పింది. అరకు, గండికోట, కాకినాడ, కోనసీమ, లంబసింగి, నరసాపూర్, ప్రకాశం బ్యారేజీ, రుషికొండ, శ్రీశైలం, తిరుపతిలలో వీటిని ఏర్పాటు చేస్తారని పేర్కొంది. కాగా సీ ప్లేన్ల ద్వారా రాకపోకలు సాగించేలా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు.

News December 1, 2025

పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం చేయలేదు: సీఎం రేవంత్

image

TG: పాలమూరు నుంచి ఎంపీగా చేసిన మాజీ సీఎం KCR ఈ జిల్లాకు ఏం చేయలేదని CM రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టులను ప్రారంభించామని మక్తల్ సభలో పేర్కొన్నారు. ‘రైతులు నష్టపోవద్దని ఎకరాకు ₹20L పరిహారం ఇస్తున్నాం. రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. చదువు లేకపోవడం వల్లే మన ప్రాంతం వెనుకబడింది. అందుకే IIIT మంజూరు చేశాం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం’ అని తెలిపారు.

News December 1, 2025

హనుమాన్ చాలీసా భావం – 26

image

సంకటసే హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై ||
మనసు, మాట, కర్మ.. ఈ త్రికరణ శుద్ధితో హనుమంతుడిపై భక్తి ఉంచితే ఆయన మనల్ని భయాల నుంచి కాపాడతాడు. కష్టాల నుంచి విముక్తులను చేస్తాడు. మన ఆలోచనలో, ఆచరణలో, మాటలో భక్తి భావం ఉన్నవారికి ఆంజనేయుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలా లభించినవారు కష్టాలను దాటి, జీవితంలో అపార విజయాన్ని అందుకుంటారు. <<-se>>#HANMANCHALISA<<>>