News October 23, 2024

భారీ వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక

image

బంగాళాఖాతంలో ‘దానా’ తుఫాన్ కారణంగా APలో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో తీరం వెంట గంటకు 80-90KM వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంది. ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలంది. రేపు అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది.

Similar News

News January 3, 2025

24 గంటల్లో ₹2లక్షలు లాభపడ్డ BITCOIN

image

కొన్ని రోజులుగా డౌన్‌ట్రెండులో పయనిస్తున్న బిట్‌కాయిన్‌‌కు మళ్లీ మూమెంటమ్ పెరిగింది. కీలకమైన $92000 సపోర్ట్ లెవల్ నుంచి బలంగా పుంజుకుంది. గత 24 గంటల్లో $2393 (₹2L) లాభపడింది. ప్రస్తుతం $96,940 వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ 1.96% పెరిగి $1.91Tకు చేరుకుంది. ఎథీరియం 2.10% ఎగిసి $3,459 వద్ద చలిస్తోంది. XRP 1.63, SOL 3.67, DOGE 2.71, ADA 2.97, TON 1.41, SLM 4.77, SHIB 3.3, LINK 1.40% మేర ఎగిశాయి.

News January 3, 2025

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధర

image

బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.870 పెరిగి రూ.79,200గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.800 పెరిగి రూ.72,600కు చేరింది. అటు కేజీ వెండి ధర ఏకంగా రూ.2000 పెరిగి రూ.1,00,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

News January 3, 2025

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం స్వామిని 62,085మంది దర్శించుకోగా 15,681 మంది తలనీలాల సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4.17కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది. జ‌న‌వ‌రి 10-19 వ‌ర‌కు శ్రీవారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వెల్లడించింది.