News August 26, 2025
భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ఇస్తారా?

AP: అర్ధరాత్రి నుంచి వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాగే కొనసాగుతూ 20-25cmల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశముందని, ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మీ ఏరియాలో వర్షం కురుస్తోందా?
Similar News
News August 26, 2025
రేబీస్ సోకిందని పాపను చంపి తల్లి సూసైడ్

TG: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. యశోద(36) అనే మహిళ రేబీస్ సోకిందని తన మూడేళ్ల కూతురును చంపి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి యశోద భర్త సంచలన విషయాలు వెల్లడించారు. కుక్కలు ఎంగిలి చేసిన పల్లీలు తినడంతో పాపకు రేబీస్ సోకిందని యశోద అనుమానించిందని అన్నారు. టీకాలు వేయించినా అనుమానం పోలేదని, మతిస్తిమితం కోల్పోయిందని చెప్పారు. ఈ క్రమంలోనే పాపను చంపి తను ఉరివేసుకుందని తెలిపారు.
News August 26, 2025
భారీ వర్షాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

AP: అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. అటు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
News August 26, 2025
పెరిగిన గోల్డ్ రేట్స్

నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 పెరిగి రూ.1,02,060కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.500 ఎగబాకి రూ.93,550 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,30,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.