News June 16, 2024
అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత

జమ్మూకశ్మీర్లో ఇటీవల వరుసగా ఉగ్రదాడులు జరుగుతుండటంతో ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. యాత్రికులకు RFID కార్డ్స్ ఇవ్వాలని భావిస్తోంది. J&Kపై ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇవాళ సమీక్షించారు. ఉగ్రవాదుల ఏరివేతకు అదనపు బలగాలు తరలించి కూంబింగ్ వేగవంతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
Similar News
News January 3, 2026
IIIDMలో నాన్ టీచింగ్ పోస్టులు

IIIT డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కర్నూలు 16 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/B.Tech/MSc/MCA, ME/MTech, MBA, BSc నర్సింగ్, B.PEd, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.iiitk.ac.in
News January 3, 2026
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్

TG: కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కీలకమైన నీటి అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంటే సభ్యులు లాబీలో తిరగడంపై సీరియస్ అయ్యారు. సభలో ఎవరూ లేకపోవడంతో వారిని వెంటనే లోపలికి పిలిపించాలంటూ విప్లను ఆదేశించారు.
News January 3, 2026
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సిట్?

TG: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం, ఖర్చు పెట్టిన నిధులపై విచారణకు సిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.


