News May 14, 2024
ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌లకు భారీ భద్రత
TG: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎంలకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. వాటిని ఉంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. తరలింపు సమయంలో వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఇక అన్ని స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. తొలి అంచెలో పారామిలిటరీ, రెండో అంచెలో సాయుధ సిబ్బంది, మూడో స్థాయిలో పోలీసులు కాపలా కాస్తున్నారు.
Similar News
News January 10, 2025
తెలుగు యూట్యూబర్‌కు 20 ఏళ్ల జైలు
AP: తెలుగు యూట్యూబర్ భార్గవ్‌కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఓ బాలికపై లైంగిక దాడి కేసులో విశాఖ కోర్టు ఈ తీర్పునిచ్చింది. బాధితురాలికి రూ.4 లక్షల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని ఆదేశించింది. కాగా భార్గవ్ ‘ఫన్ బకెట్’ పేరుతో వీడియోలు చేసి ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలో తనతో నటించే ఓ బాలికపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డట్లు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
News January 10, 2025
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి నేత
కెనడా PM పదవికి పోటీలో నిలుస్తున్నట్లు భారత సంతతి, లిబరల్ పార్టీ MP చంద్రా ఆర్యన్ ప్రకటించారు. దేశాన్ని మరింత సుస్థిర ప్రగతివైపు నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆర్యన్ స్వస్థలం కర్ణాటక కాగా కెనడాలో స్థిరపడ్డారు. ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే ఆయన, భారత్-కెనడా బంధం బలోపేతానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ప్రధాని ట్రూడో పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
News January 10, 2025
గర్భిణులకు సీమంతం చేసిన పవన్ కళ్యాణ్
AP: పిఠాపురంలో నిర్వహించిన పల్లె పండుగ వారోత్సవాల్లో Dy.CM పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అక్కడ శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో పవన్ గర్భిణులకు సీమంతం చేశారు. అనంతరం వారికి అందజేస్తున్న పోషకాహారం గురించి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు భోగి పళ్ల ఉత్సవం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను తిలకించారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను పరిశీలించారు.