News April 10, 2025

రాణా తరలింపునకు భారీ భద్రత

image

కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్న <<16050508>>రాణా<<>>ను కట్టుదిట్టమైన భద్రత మధ్య NIA కార్యాలయానికి తరలించనున్నారు. భారత వైమానిక దళానికి చెందిన పాలెం విమానాశ్రయంలో దిగగానే బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్‌లోకి అతడిని షిఫ్ట్ చేస్తారు. సాయుధ బలగాలు, స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ కమాండోల రక్షణతో ట్రాఫిక్ క్లియర్ రూట్‌లో కాన్వాయ్ వెళ్తుంది. ఏ రకమైన దాడినైనా తట్టుకునే ‘మార్క్స్ మ్యాన్’ వాహనాన్ని దీనికి స్టాండ్‌బైగా ఉంచారు.

Similar News

News November 4, 2025

రాత్రంతా ఆలోచిస్తూ, ఒంటరిగా ఉంటూ.. మృత్యుంజయుడి ఆక్రందన!

image

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన <<16688689>>మృత్యుంజయుడు<<>> రమేశ్ మానసికంగా కుంగిపోతున్నాడు. ‘ప్రమాదంలో తమ్ముడిని కోల్పోయా. ఆ ఘటన పదే పదే గుర్తొస్తోంది. రాత్రంతా ఆలోచిస్తూ, మేలుకొనే ఉంటున్నా. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నా. నా భార్యతో, కొడుకుతోనూ మాట్లాడటం లేదు. మానసికంగా బాధపడుతున్నా. 4 నెలలుగా అమ్మ మాట్లాడట్లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

News November 4, 2025

డిస్కంలకు రూ.2,635 కోట్లు విడుదల

image

AP: డిస్కంలకు చెల్లించాల్సిన టారిఫ్ సబ్సిడీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2025-26 మూడో త్రైమాసికానికి సంబంధించి రూ.2,635 కోట్లను రిలీజ్ చేసింది. హడ్కో నుంచి రూ.5వేల కోట్ల రుణం పొందేందుకు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు హామీ ఇచ్చింది. విద్యుత్, బొగ్గు కొనుగోళ్లు, నిర్వహణ అవసరాలకు వెచ్చించాలని ఆదేశించింది.

News November 3, 2025

ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రేపు ఉ.8.30 గంటల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, యాదాద్రి, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, HYD, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.