News September 7, 2024
భారీ నుంచి అతి భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెప్పింది. ఈరోజు 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. రేపు 5 జిల్లాలకు, ఎల్లుండి 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. 3 రోజుల పాటు వాయుగుండం కొనసాగే ఛాన్స్ ఉందని పేర్కొంది.
Similar News
News October 30, 2025
జీవ ముక్తికి మార్గం ఈ కార్తీక మాసం

ఈ పవిత్ర మాసంలో కార్తీక వ్రతం ఆచరించేవారు జీవన్ముక్తులు అవుతారు. స్త్రీ, పురుష, వయో భేదం లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలా చేయనివారు ‘అంధతామిత్రము’ అనే నరకాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో కావేరీ నదీ స్నానం, దీపారాధన, దీపదానం చేయడం పుణ్యప్రదం. ధన-ధాన్య-ఫల దానాలు కూడా అమిత ఫలదాయకాలు. ఈ 30 రోజులు కార్తీక మహాత్మ్యాన్ని చదివినా, విన్నా జీవన్ముక్తి లభిస్తుంది. <<-se>>#Karthikam<<>>
News October 30, 2025
మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగాలో ఉద్యోగాలు

మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా 9 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, పీజీ(యోగా& నేచురోపతి), పీహెచ్‌డీ, CA/ICWA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.yogamdniy.nic.in/
News October 30, 2025
పత్తిలో 20% తేమ ఉన్నా కొనండి.. CCIకి లేఖ

TG: భారీ వర్షాల నేపథ్యంలో పత్తిలో 20 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలని CCIకి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ మల్లు రవి లేఖ రాశారు. తేమ పెరగడం వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే రబీ సీజన్ కోసం నెలకు 2 లక్షల టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. కాగా క్షేత్రస్థాయిలో పత్తిలో 12% తేమ దాటితే <<18118478>>మద్దతు ధర<<>> దక్కడం లేదు.


