News October 24, 2025

భారీ నుంచి అతిభారీ వర్షాలు

image

ఏపీలోని గుంటూరు, విజయవాడతో పాటు పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అనకాపల్లి, ఏలూరు, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ వానలు పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అటు దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు.

Similar News

News October 24, 2025

లిక్కర్ స్కామ్ కేసు.. రిమాండ్ పొడిగింపు

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో ఏడుగురు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు నవంబర్ 7 వరకు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్టు కాగా ఐదుగురు బెయిల్‌పై విడుదలయ్యారు. ఏడుగురు నిందితులు రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ కుమార్, నవీన్ కృష్ణ విజయవాడ, గుంటూరు జిల్లా జైళ్లలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

News October 24, 2025

శివ పూజలో ఈ పత్రాలను వాడుతున్నారా?

image

పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళాలను శివ పూజలో వినియోగించడం ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. త్రిదళాలుగా పిలిచే ఈ ఆకులు శివుడి త్రిగుణాతీత స్వరూపానికి, 33 కోట్ల దేవతలకు ప్రతీకగా భావిస్తారు. అందుకే శివాలయాలలో నిత్యం బిల్వార్చనలు చేస్తారు. పురాణాల ప్రకారం.. కేవలం మారేడు దళాలను శివలింగానికి అర్పించడం ఎంతో పుణ్యం పుణ్యమట. ఫలితంగా అద్భుతమైన శుభ ఫలితాలను ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.

News October 24, 2025

దీపావళికి వచ్చి వెళ్తుండగా సజీవదహనం

image

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి సజీవదహనం అయ్యారు. యాదాద్రి జిల్లా గుండాల మం. వస్తకొండూరుకు చెందిన అనూష బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. దీపావళికి ఇంటికి వచ్చిన ఆమె.. నిన్న రాత్రి బెంగళూరు వెళ్లేందుకు ఖైరతాబాద్‌లో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కారు. బస్సు దగ్ధమైన ఘటనలో ఆమె సజీవదహనం అయ్యారు. దీంతో అనూష పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.