News August 27, 2024
భారీ నుంచి అతిభారీ వర్షాలు: IMD

TG: ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
Similar News
News January 1, 2026
‘సిటీ ఆఫ్ హనీ’ అని దేనిని పిలుస్తారో తెలుసా?

సంప్రదాయ, ఆధునిక పద్ధతుల్లో తేనె ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్గంజ్ను ‘సిటీ ఆఫ్ హనీ’ అని పిలుస్తారు. ఇండో-నేపాల్ బార్డర్ సమీపంలో ఉన్న ఈ ప్రాంతం పండ్ల తోటలు, పూల వనాలతో తేనెటీగల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన తేనెను యూరప్, గల్ఫ్, సౌత్ ఈస్ట్ ఏషియాకు ఎగుమతి చేస్తారు. దేశంలోని చాలా రాష్ట్రాలకు కూడా మహారాజ్‌గంజ్ నుంచే సప్లై అవుతుంది.
News January 1, 2026
ఎల్లుండే టీమ్ ప్రకటన.. షమీ రీఎంట్రీ?

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టును ఈ నెల 3న BCCI ఎంపిక చేయనుంది. ఇటీవల సౌతాఫ్రికాతో మ్యాచులకు దూరమైన గిల్ తిరిగి టీమ్‌లోకి రానున్నారు. సీనియర్ ప్లేయర్లు హార్దిక్, బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయస్ ఈ సిరీసూ ఆడబోరని సమాచారం. ఎన్నాళ్ల నుంచో కమ్‌బ్యాక్ కోసం చూస్తున్న షమీ రీఎంట్రీ ఇవ్వొచ్చు. సర్ఫరాజ్కూ చోటు దక్కే ఛాన్స్ ఉంది. JAN 11న తొలి వన్డే జరగనుంది.
News January 1, 2026
డ్రంకెన్ డ్రైవ్.. రీడింగ్ చూస్తే షాకే!

TG: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మందుబాబు రీడింగ్ చూసి పోలీసులు అవాక్కయ్యారు. నిన్న రాత్రి వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యక్తికి బ్రీత్ అనలైజర్‌తో చెక్ చేయగా ఏకంగా 438 రీడింగ్ నమోదైంది. న్యూఇయర్ వేళ డ్రంకెన్ డ్రైవ్‌లో నమోదైన రీడింగ్‌ల్లో ఇదే అత్యధికమని ఏఎస్పీ శుభం ప్రకాశ్ తెలిపారు. కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.


