News December 5, 2024

సౌతాఫ్రికా కెప్టెన్‌గా హెన్రిచ్ క్లాసెన్

image

పాకిస్థాన్‌తో T20 సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు హెన్రిచ్ క్లాసెన్ నాయకత్వం వహిస్తారు. మార్క్‌రమ్, జాన్సెన్, మహరాజ్, స్టబ్స్, రబడ వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. జట్టు: క్లాసెన్, క్రూగర్, పీటర్, బార్ట్‌మన్, లిండే, రికెల్‌టన్, బ్రెట్జ్‌కీ, మఫాకా, షంషీ, ఫెర్రీరా, మిల్లర్, సైమ్‌లైన్, హెండ్రిక్స్, నోకియా, డస్సెన్. ఈ నెల 10 నుంచి ఇరు జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానుంది.

Similar News

News January 4, 2026

విడాకులు ప్రకటించిన సెలబ్రిటీ కపుల్

image

జై భానుశాలి-మాహీ విజు దంపతులు విడాకులు ప్రకటించారు. 2011లో పెళ్లి చేసుకున్న వీరు వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కాగా జై హిందీలో అనేక సీరియల్స్‌లో నటించి, డాన్స్ ఇండియా డాన్స్, సరిగమప, సూపర్ స్టార్ సింగర్ తదితర షోలు హోస్ట్ చేశారు. BB 12, 13లలో పాల్గొన్నారు. ఇక BB13కూ వెళ్లిన మాహీ ‘తపన’ మూవీ, ‘చిన్నారి పెళ్లికూతురు, వసంత కోకిల’ తదితర ఒరిజినల్ వెర్షన్ సీరియల్స్‌లో నటించారు.

News January 4, 2026

భోగాపురం.. మైలురాయితో కొత్త రెక్కలు: CBN

image

AP: భోగాపురంలో వ్యాలిడేషన్ ఫ్లైట్ ల్యాండింగ్ విజయవంతం కావడంపై CM చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర విమానయాన ప్రయాణం ఇవాళ మరో మైలురాయికి చేరిందని ట్వీట్ చేశారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్ర వృద్ధికి కొత్త రెక్కలని అభివర్ణించారు. అటు AP అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోదీకి ఈ సందర్భంగా బాబు ధన్యవాదాలు తెలిపారు.

News January 4, 2026

ప్రియాంకకు బిగ్ రోల్.. అస్సాం గెలుపు బాధ్యత ఆమె చేతుల్లో!

image

అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పెద్ద బాధ్యత అప్పగించింది. స్క్రీనింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా నియమించింది. గెలిచే అవకాశం ఉన్న నేతలను షార్ట్‌లిస్ట్ చేయడం ఆమె ప్రధాన బాధ్యత. అక్కడ రాజకీయ పరిస్థితులు క్లిష్టంగా ఉండటంతో జాతీయ స్థాయిలో క్రేజ్ ఉన్న ప్రియాంకను రంగంలోకి దించడం ద్వారా క్యాడర్‌లో జోష్ నింపాలని పార్టీ భావిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని ఆమె బలోపేతం చేయాల్సి ఉంటుంది.