News October 13, 2025
సంక్రాంతి నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలు!

TG: హెలీ టూరిజానికి రాష్ట్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. నల్లమల అడవి మీదుగా గంట పాటు ఈ ప్రయాణం సాగనుంది. ఇది సక్సెస్ అయితే ఉమ్మడి వరంగల్‌లోని రామప్ప, లక్నవరానికీ విస్తరించాలని యోచిస్తోంది. ఈ సేవల కోసం బుకింగ్ యాప్ లేదా వెబ్‌సైట్ తీసుకురానుంది.
Similar News
News October 13, 2025
నాలుగో రోజు ప్రారంభమైన ఆట

భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఫాలో ఆన్ ఆడుతున్న WI 93 పరుగుల వెనుకంజలో ఉంది. నిన్న 35కే రెండు వికెట్లు కోల్పోయినా క్యాంప్‌బెల్(90), హోప్(67) క్రీజులో నిలదొక్కుకొని 138 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం WI స్కోర్ 177/2గా ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 518/5 డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.
News October 13, 2025
ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులను నేరుగా కలవాలని నిర్ణయించుకున్నారు. నిన్న హైదరాబాద్‌లో పలువురు అభిమానులను ఆయన కలిశారు. దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే తరహాలో ఫ్యాన్స్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. పుష్ప సిరీస్‌తో అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
News October 13, 2025
వ్యాయామంతో క్యాన్సర్ చికిత్స సైడ్‌ఎఫెక్ట్స్‌కి చెక్

బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో భాగమైన రేడియోథెరపీతో పేషెంట్లు విపరీతమైన అలసటకు గురవుతారు. అయితే రెసిస్టెన్స్, ఏరోబిక్ వ్యాయామాలు చేస్తే దీన్నుంచి త్వరగా కోలుకోవచ్చని ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. వ్యాయామం కారణంగా చెడు ప్రభావాలు కనిపించలేదని స్టడీ వెల్లడించింది. కాబట్టి చికిత్స తర్వాత చిన్న చిన్న వ్యాయామాలు ఎంతో ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. <<-se>>#Womenhealth<<>>