News October 22, 2024
Hello విజయవాడ.. రెడీనా..!

విజయవాడ పున్నమి ఘాట్ వద్ద కృష్ణా నదీ తీరంలో మరికొన్ని గంటల్లో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో జరగనుంది. 5,500 డ్రోన్లతో సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8గంటల వరకు ప్రదర్శన ఉంటుంది. అర కిలోమీటరు ఎత్తులో ఏడు ఆకృతులను డ్రోన్లతో ఆవిష్కరించనున్నారు. ఈ షో చూసేందుకు నగరంలోని పలు చోట్ల డిజిటల్ తెరలను ఏర్పాటు చేశారు. మరి ఆలస్యమెందుకు.. 6.30కల్లా డ్రోన్ షో చూసేందుకు సిద్ధమవ్వండి.
Similar News
News November 14, 2025
కృష్ణా: రేపటి నుంచి మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ

మహిళలకు రేపటి నుంచి స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు నైపుణ్యాభివృద్ధి మహిళా సాధికారత కేంద్రం జిల్లా మేనేజర్ ఎస్. జుబేదా పర్వీన్ శుక్రవారం తెలిపారు. పామర్రు (M) నిమ్మకూరు ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత కేంద్రంలో 18-35 వయసు కలిగిన మహిళలకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ బ్యూటీ తెరపిస్ట్, జనరల్ డ్యూటీ నర్సింగ్ అసిస్టెంట్, మగ్గం వర్క్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
News November 14, 2025
అప్పుడు జోగి రవాణా అయితే ఇప్పుడు ఎవరి రవాణా.?

పెడన నియోజకవర్గంలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన బుసక రవాణా నేటికీ కొనసాగుతూనే ఉంది. కూటమి నాయకుల ఆరోపణల ప్రకారం, వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన బుసక రవాణా మొత్తం అప్పటి మంత్రి జోగి రమేశ్ కనుసన్నల్లో జరిగిందని ఆరోపిస్తున్నారు. దీనికి ప్రతిస్పందించిన వైసీపీ నాయకులు, బుసక రవాణా నేటికి కూడా అలాగే కొనసాగుతుంది. అప్పుగు జోగి కారణం అయితే, నేడు జరుగుతున్న రవాణాకు బాధ్యత ఎవరిది.? అని ప్రశ్నిస్తున్నారు.
News November 14, 2025
స్వచ్ఛ ఆంధ్రలో ప్రతి అధికారి పాల్గొనాలి: కలెక్టర్

స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడవ శనివారం నాడు నిర్వహించే శుభ్రత కార్యక్రమంలో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గురువారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ, భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై చర్చించారు.


