News May 13, 2024

హలో హైదరాబాద్.. ఇక లేవండి సార్!

image

హైదరాబాద్‌లోని పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. దీంతో ఉదయం 9 గంటల వరకు హైదరాబాద్‌లో 5.06%, సికింద్రాబాద్‌లో 5.40% ఓటింగ్ మాత్రమే నమోదైంది. సెలవు దినమని నగరవాసులు ఇంకా నిద్రలేవలేదా? అని, ఓటేసేందుకు ఇష్టపడట్లేదా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అత్యధికంగా ఆదిలాబాద్ (13.22%), జహీరాబాద్ (12.88%), నల్గొండ (12.80%)లో ఓటింగ్ జరిగింది.

Similar News

News March 4, 2026

ఇవాళ స్కూళ్లకు సెలవేనా?

image

చంద్రగ్రహణంతో ఈసారి హోలీ పండుగ ఎప్పుడనే గందరగోళం ఏర్పడింది. కొందరు నిన్నే రంగులు చల్లుకోగా.. AP, TG ప్రభుత్వాలూ స్కూళ్లకు మంగళవారమే సెలవు ఇచ్చాయి. అయితే గ్రహణం ఉండటంతో ఇవాళ(బుధవారం) హోలీ జరుపుకోవాలని పండితులు తెలిపారు. కానీ స్కూళ్లకు నిన్నే పబ్లిక్ హాలిడే ఇవ్వడంతో ఇవాళ సెలవు లేదు. పిల్లలు బడికి వెళ్లాల్సిందే. అటు చాలావరకు ప్రైవేటు కార్యాలయాలకు ఇవాళ సెలవు ఉన్నట్లు తెలుస్తోంది. మరి మీకూ ఉందా?

News March 4, 2026

దేశంలో 12% పెరిగిన ఉద్యోగ నియామకాలు

image

దేశంలో వైట్ కాలర్ జాబ్స్‌ నియామకాలు గత ఫిబ్రవరితో పోలిస్తే 12% పెరిగినట్లు నౌక్రీ సంస్థ రిపోర్ట్ వెల్లడించింది. ఏఐని అందిపుచ్చుకోవడం, ఐటీ రంగం కోలుకోవడమే ఇందుకు కారణాలుగా పేర్కొంది. ఐటీ రంగంలో నియామకాలు 6% పెరగగా.. ఇందులో ఫ్రెషర్స్ హైరింగ్ 8% పెరిగినట్లు తెలిపింది. నాన్ ఐటీ రంగాల నియామకాల్లో ఇన్సూరెన్స్‌లో 28%, BPO 22%, రియల్ఎస్టేట్ 19%, హాస్పిటాలిటీలో 15%, రిటైల్ 14% గ్రోత్ నమోదైంది.

News March 4, 2026

ఎండలు బాబోయ్..! ఏప్రిల్, మేలో హీట్ వేవ్స్

image

దేశంలో ఈసారి ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మార్చి నుంచి మే వరకు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఏప్రిల్, మేలో దక్షిణ, మధ్య భారతంలో హీట్ వేవ్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని వెల్లడించింది. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు తప్పవని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు TGలో వచ్చే రెండు,మూడు రోజుల్లో టెంపరేచర్ 40డిగ్రీలను తాకుతుందని అంచనా వేసింది.