News December 3, 2024
హలో.. నేను మీ ముఖ్యమంత్రి చంద్రబాబు..

ఏపీలో సంక్షేమ పథకాల అమలుపై ప్రజాస్పందనను సీఎం చంద్రబాబు నేరుగా తెలుసుకోనున్నారు. ఇందుకోసం చంద్రబాబు వాయిస్తో లబ్ధిదారులకు ఫోన్ కాల్స్ వెళ్లనున్నాయి. IVRS విధానంలో కొనసాగే ఈ కాల్లో తాము పొందుతున్న పథకం, దానిపై స్పందనను నమోదు చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో పథకాలు అమలు చేసినా ప్రజల అభిప్రాయం తెలుసుకోకపోవడంతో ఫలితం బెడిసికొట్టడంతో తమ విషయంలో అలా జరగొద్దని బాబు ఈ నిర్ణయం తీసుకున్నారట.
Similar News
News October 31, 2025
అక్టోబర్ 31: చరిత్రలో ఈరోజు

1875: స్వాతంత్ర్య సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జననం
1895: IND టెస్ట్ టీమ్ తొలి కెప్టెన్ CK.నాయుడు జననం
1975: సంగీత దర్శకుడు ఎస్డీ బర్మన్ మరణం
1984: మాజీ PM ఇందిరా గాంధీ మరణం
1990: గాయని ML.వసంతకుమారి మరణం
2022: పారిశ్రామికవేత్త జేజే ఇరానీ మరణం
* జాతీయ ఐక్యతా దినోత్సవం (వల్లభ్భాయ్ జయంతిని కేంద్రం జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుతోంది)
News October 31, 2025
పెళ్లి చేసుకున్న నారా రోహిత్, నటి శిరీష

టాలీవుడ్ హీరో నారా రోహిత్, నటి శిరీష వివాహం గురువారం రాత్రి వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరిద్దరూ ఏడడుగులు వేశారు. AP CM చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్ తదితరులు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రోహిత్, శిరీష ‘ప్రతినిధి-2’ సినిమాలో జంటగా నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో వివాహబంధంతో ఒక్కటయ్యారు.
News October 31, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


