News April 23, 2025
పహల్‌గామ్ బాధితుల కోసం హెల్ప్ డెస్క్: మంత్రి లోకేశ్

AP: పహల్‌గామ్ ఉగ్రదాడి బాధితుల కోసం ఢిల్లీ AP భవన్‌లో ఎమర్జెన్సీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. బాధితులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఎలాంటి సహాయం అవసరమైనా ‘98183 95787’ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. కాగా ఉగ్రదాడిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే.
Similar News
News April 23, 2025
పాత బెడ్‌పై నిద్రిస్తున్నారా?

మనం పడుకునే బెడ్ కూడా నిద్రను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏడేళ్లకు మించి ఒకే పరుపును ఉపయోగించడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. పాత బెడ్‌పై నిద్రిస్తే చేతులు, కాళ్ల నొప్పులతోపాటు నిద్రలేమి సమస్య వెంటాడుతుంది. వెన్నునొప్పి సమస్యకు దారితీస్తుంది. పరుపుల తయారీలో వాడే నాఫ్తలీన్, బెంజీన్ వంటి వాటి వల్ల అలర్జీ, దురద, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది. 2-3 ఏళ్లకోసారి బెడ్స్‌ను మార్చడం బెటర్.
News April 23, 2025
టీ20ల్లో 12వేల పరుగుల క్లబ్‌లోకి హిట్‌మ్యాన్

SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ టీ20ల్లో 12 వేల పరుగులు పూర్తి చేసుకున్నారు. 456 మ్యాచుల్లో హిట్‌మ్యాన్ ఈ ఘనత సాధించారు. ఈ 12K T20 క్లబ్‌లో కోహ్లీ తర్వాత చోటు దక్కించుకున్న రెండో భారత ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించారు. ఓవరాల్ T20 క్రికెట్‌లో 8వ ప్లేయర్‌గా నిలిచారు. 12వేలు పరుగులు చేసిన లిస్టులో గేల్, అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్, పోలార్డ్, కోహ్లీ, డేవిడ్ వార్నర్, జోష్ బట్లర్ ఉన్నారు.
News April 23, 2025
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా

ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించారు. టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా ఆయన అవతరించారు. హైదరాబాద్‌తో మ్యాచులో బుమ్రా ఈ ఫీట్ నెలకొల్పారు. 237 ఇన్నింగ్సుల్లో ఆయన ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా జస్ప్రీత్ నిలిచారు. అగ్ర స్థానంలో ఆండ్రూ టై ఉన్నారు. అతడు 208 మ్యాచుల్లోనే 300 వికెట్ల మార్కును అందుకున్నారు.