News September 1, 2024
రైతులు, బాధితులకు వెంటనే సాయం అందించాలి: సీఎం చంద్రబాబు

AP: వర్షాలు తగ్గగానే నివాస ప్రాంతాల్లో వరద లేకుండా చర్యలు తీసుకోవాలని, వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉన్నతాధికారులతో సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘వరదలు తగ్గగానే ఆస్తి, పంట నష్టం వివరాలు సేకరించి కేంద్రానికి పంపాలి. రైతులు, బాధిత ప్రజలకు వెంటనే సాయం అందించాలి. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. డ్రోన్లు, సీసీ కెమెరాలతో పరిస్థితిని సమీక్షించాలి’ అని సూచించారు.
Similar News
News December 25, 2025
TDPలో పదవుల జాతర!

AP: TDPలో ఒకేసారి 1,050 మందికి పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీల్లో పదవులు దక్కనున్నాయి. ఒక్కో కమిటీలో 9మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యనిర్వహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, ట్రెజరర్, మీడియా కో-ఆర్డినేటర్, SM కో-ఆర్డినేటర్లు ఉంటారని సమాచారం. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో కలిపి కమిటీలో 42 మందిని నియమించనున్నారు. ఈ కమిటీల్లో మహిళలకు 28% కేటాయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
News December 25, 2025
ఐటీ జాబ్ వదిలి వ్యవసాయం.. రోజూ రూ.15వేలు ఆదాయం

రూ.లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగం వదిలి.. సాగు బాట పట్టి సక్సెస్ అయ్యారు ఝార్ఖండ్లోని అంబతాండ్కు చెందిన యువరైతు ఉదయ్ కుమార్. బీటెక్ పూర్తి చేసి పుణేలో IT జాబ్ పొందిన ఉదయ్ సొంతూరిని వదిలి ఉండలేకపోయారు. 6 నెలలకే జాబ్ వదిలి, ఊరుకు వచ్చి 20 ఎకరాల్లో మిరప, టమాటా, క్యాబేజీ, బఠాణీ పండిస్తూ రోజూ రూ.15వేలకు పైగా ఆర్జిస్తున్నారు. ఉదయ్ పడ్డ కష్టాలు, సక్సెస్కు కారణాల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 25, 2025
క్రిస్మస్ శుభాకాంక్షలు

అంతటా క్రిస్మస్ శోభ వెల్లివిరుస్తోంది. ప్రపంచమంతా కలిసి జరుపుకునే అతి పెద్ద పండుగ ఇది. యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు అంతా పవిత్ర పండుగగా జరుపుకుంటారు. పాపాన్ని త్యజించి మనసా, వాచా, కర్మణా పరిశుద్ధ జీవితం కొనసాగించినప్పుడే పరలోక ప్రాప్తి లభిస్తుందని యేసు బోధించారు. చెడును విడిచి మంచిని పంచిన వారి హృదయాల్లోనే ఆయన ఉంటాడని చెబుతారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.


