News September 6, 2024

రోజంతా కష్టపడి వరద బాధితులకు సాయం!

image

‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అని పెద్దలంటుంటారు. మనం చేసే సాయం ఎంత చిన్నదైనా ఆ ఆలోచన రావడం ఎంతో గొప్పది. హైదరాబాద్‌కు చెందిన సాయి అనే రాపిడో బైక్ నడిపే వ్యక్తి తాను రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులను విరాళమిచ్చి మంచిమనసు చాటారు. వరద బాధితుల కోసం రూ.780ను తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేసినట్లు ట్వీట్ చేశారు. సాయిని అంతా అభినందిస్తున్నారు. మీరూ <<14018795>>ఇలా విరాళం<<>> ఇవ్వొచ్చు.

Similar News

News November 24, 2025

DEC తొలి వారంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు!

image

AP: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి DEC తొలి వారంలో నియామక పత్రాలు అందజేసి, శిక్షణకు పంపిస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చినట్లు MLC వేపాడ చిరంజీవి తెలిపారు. ఇదే విషయమై ఆమెకు లేఖ రాయగా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. 6,100 కానిస్టేబుల్ పోస్టులకు ఈ ఏడాది జూన్‌లో మెయిన్స్ నిర్వహించి AUGలో ఫలితాలు ప్రకటించారు. ఉద్యోగాలకు ఎంపిక చేసినా ట్రైనింగ్ ప్రారంభం కాకపోవడంతో అభ్యర్థులు నిరాశతో ఉన్నారు.

News November 24, 2025

బీమా కంపెనీల విలీనం.. పార్లమెంటులో బిల్లు?

image

బ్యాంకుల తరహాలోనే ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల విలీన ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఓరియంటల్, నేషనల్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లను ఒకే కంపెనీగా చేయనున్నట్లు సమాచారం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతారని తెలుస్తోంది. వాటిని ఆర్థికంగా మెరుగుపర్చడమే దీని ఉద్దేశం. 2018-19లో ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ మధ్యలోనే ఆగిపోయింది. అప్పట్లో వీటి బలోపేతానికి కేంద్రం ₹17450Cr కేటాయించింది.

News November 24, 2025

ఎయిమ్స్ కల్యాణి 172 పోస్టులకు నోటిఫికేషన్

image

పశ్చిమ బెంగాల్‌లోని <>ఎయిమ్స్ కల్యాణి <<>>172 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, DNB, DM, MCH, MSc, M.biotech, M.Stat, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిసెంబర్ 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://aiimskalyani.edu.in/