News May 5, 2024
తెలుగు రాష్ట్రాలకు మునుపెన్నడూ లేనంత సాయం: పీఎం మోదీ

తెలంగాణకు తగినన్ని నిధుల్ని ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించడం కేవలం ఆ ప్రభుత్వ చేతగానితనమేనని ప్రధాని మోదీ విమర్శించారు. ‘రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర సాయం మునుపెన్నడూ లేని స్థాయిలో అందుతోంది. 2004-14 మధ్యకాలంలో ఉమ్మడి ఏపీకి పన్నుల్లో వాటాగా రూ.1,32,384 కోట్లే రాగా, 2014-24 మధ్యకాలంలో తెలంగాణకు రూ.1,52,288 కోట్లు, ఏపీకి రూ.2,94,602కోట్ల వాటా దక్కింది’ అని వివరించారు.
Similar News
News November 24, 2025
ఆఖరి మజిలీలో అడవి పార్టీ!

అట్టడుగు వారికి చట్టం చేయని న్యాయం తుపాకీ గొట్టం చేస్తుందని నమ్మిన అడవి పార్టీ ఆఖరి మజిలీలో ఉంది. అర్ధ శతాబ్దం క్రితం సమాజంలో వారి అవసరం, ఆ స్థాయిలో మద్దతూ ఉండేవి. కాలంతో పాటు పరిస్థితులు, ప్రజల జీవనం మారాయి. కానీ నక్సలైట్లుగా మొదలై మావోయిస్టులుగా రూపాంతరం చెందినా తమ పోరాట పంథా మార్చుకోలేదు. ఫలితం.. ప్రజలకు పరిష్కారం అవుతామన్న ‘అన్న’ తమ ఊపిరి ఉండాలంటే ‘గన్ను’ వీడటమే పరిష్కారమనేలా చేసింది.
News November 24, 2025
బేబీ కార్న్‌ను ఈ సమయంలో కోస్తే ఎక్కువ లాభం

బేబికార్న్ కండెలను 45-50 రోజులప్పుడు పీచు 2-3 సెం.మీ. ఉన్నప్పుడు అంటే పీచు వచ్చిన 1-3 రోజులకు కోయాలి. కోత ఆలస్యం చేస్తే కండెలు గట్టిపడి, విత్తనాలు వచ్చి బేబీ కార్న్‌గా ఉపయోగించేందుకు పనికిరావు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోస్తే కండెల నాణ్యత బాగుంటుంది. యాసంగిలో రోజు విడిచి రోజు పంటకోత చేపట్టాలి. కోసిన కండెల పీచు తీసేసి, సైజువారీగా ప్యాకింగ్ చేసి 10° సెంటీగ్రేడ్ వద్ద 3-4 రోజుల వరకు నిల్వ చేయవచ్చు.
News November 24, 2025
ధర్మేంద్ర గురించి తెలుసా?

ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. పంజాబ్ లుధియానాలోని నస్రలీ గ్రామంలో 1935 డిసెంబర్ 8న ఆయన జన్మించారు. 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ కింగ్‌గానూ పేరు గాంచిన ఆయన సినీ రంగానికి చేసిన కృషికి 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2005లో BJP తరఫున రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2012లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.


