News March 18, 2024
మా ఎమ్మెల్యేకు సహకరించం: సర్పంచ్ కొనిరెడ్డి
ఎన్నికల్లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి తాను, తన అనుచరులు సహకరించబోమని కొత్తపల్లె గ్రామపంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. మా కుటుంబంలో ఎమ్మెల్యే చిచ్చు పెట్టాలని చూస్తున్నాడని, ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇవ్వమని, ప్రచారం చేయమని స్పష్టం చేశారు. త్వరలో తన అనుచరులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం మేరకు నడుచుకుంటానని తెలిపారు.
Similar News
News October 31, 2024
కడప జిల్లా వాసికి వైవీయూ డాక్టరేట్
వైవీయూ తెలుగు శాఖ స్కాలర్ తమ్మిశెట్టి వెంకట నారాయణకు డాక్టరేట్ లభించింది. ఆచార్య ఎం.ఎం.వినోదిని పర్యవేక్షణలో “తెలుగులో శ్రామిక కథలు – స్త్రీ చైతన్యం (1980 నుంచి 2015 వరకు)” అనే శీర్షికపై పరిశోధన చేశారు. లక్కిరెడ్డిపల్లి మండలం బూడిదగుంటపల్లెకు చెందిన వెంకట నారాయణ చేసిన పరిశోధనలో మూడున్నర దశాబ్ద కాలంలో గ్రామీణ, పట్టణ మహిళల స్థితిగతులు, ఆనాటి పరిస్థితులను వెలుగులోకి తెచ్చారు.
News October 30, 2024
కడప: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
కడప-కృష్ణాపురం రైలు మార్గంలోని ఎగువ రైలు పట్టాలపై షేక్ అన్వర్ బాషా (62) ఆత్మహత్య చేసుకున్నట్లు కడప రైల్వే హెడ్ కానిస్టేబుల్ గోపాల్ తెలిపారు. రామాపురం మండలం హసనాపురం గ్రామానికి చెందిన అన్వర్ బాషా అప్పుల బాధతో మంగళవారం మధ్యాహ్నం ముంబయి-చెన్నై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ వివరించారు.
News October 30, 2024
కడప: కూతురిపై మద్యం మత్తులో తండ్రి లైంగిక దాడి
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కసాయిలా మారి కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దముడియం మండల పరిధిలోని నెమళ్లదిన్నెకి చెందిన మతిస్తిమితం లేని కూతురిపై మద్యం మత్తులో తండ్రి అత్యాచారం చేసినట్లు సమాచారం. అయితే బాలిక 2 రోజులుగా నీరసంగా ఉండటంతో తల్లి కూతురిని ప్రశ్నించింది. దీంతో బాలిక తల్లి భర్తపై పోలీసు స్టేషన్లో కేసు పెట్టింది.