News April 6, 2025
కరాటే కళ్యాణికి హేమ లీగల్ నోటీసులు

తన పరువుకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారంటూ కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు పంపారు. అవాస్తవాలు ప్రచారం చేయడంతోపాటు అసభ్యంగా మాట్లాడారని తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారంటూ హేమపై కేసు నమోదవడంతో MAA ఆమెను సస్పెండ్ చేసింది. తర్వాత టెస్టుల్లో నెగటివ్ రిపోర్టు రావడంతో సస్పెన్షన్‌ను ఎత్తేసింది. ఇదే విషయంపై కళ్యాణి, హేమకు గతంలో చాలాసార్లు <<13300086>>వాగ్వాదాలు<<>> జరిగిన విషయం తెలిసిందే.
Similar News
News December 4, 2025
BELలో ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)7 సీనియర్ ఇంజినీర్, డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. డిప్యూటీ ఇంజినీర్ పోస్టులకు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా.. సీనియర్ ఇంజినీర్ పోస్టుకు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://bel-india.in
News December 4, 2025
పిల్లలను ముద్దు పేరుతో పిలుస్తున్నారా?

పిల్లలను ముద్దు పేర్లతో కాకుండా సొంత పేర్లతో పిలవడం శుభకరమని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ఆ పేరులోని సానుకూల శక్తి వారికి బదిలీ అవుతుందని అంటున్నారు. ‘పెద్దలు జన్మ నక్షత్రం ప్రకారం నామకరణం చేస్తారు. అందుకే ఆ పేరుతో పిలిస్తే.. ఆ పేరుకు సంబంధించిన గ్రహబలం, శుభ ఫలితాలు వారికి లభిస్తాయి. అలా పిల్వకపోతే ప్రతికూల శక్తులు వారిని ఆకర్షిస్తాయి’ అని చెబుతున్నారు.
News December 4, 2025
డిసెంబర్ 7న ప్రజావంచన దిన నిరసనలు: బీజేపీ

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మొదలై డిసెంబర్ 7 నాటికి రెండేళ్లు కావస్తున్న సందర్భంగా నిర్వహించే ప్రజా పాలన ఉత్సవాలను వ్యతిరేకిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు తెలిపారు. ఆ రోజున ప్రజా వంచన దినంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జ్‌షీట్ విడుదల చేస్తామని ప్రకటించారు.


